మధుమేహం ఉన్నవారు ఎముకలకు తీసుకోవలసిన జాగ్రత్తలు!

ApurupA
0
సాధారణంగా వయసు పైనబడిన వారిలో రక్తంలో క్యాల్షియం, విటమిన్-డి తక్కువగా ఉండం వల్ల ఒంటి నొప్పులు, ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య మధుమేహుల్లో కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. కాబట్టి మధుమేహులు విటమిన్-డి, క్యాల్షియం కోసం డాక్టర్ సలహాతో మందుల్ని ఎక్కువ కాలమే వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సమస్య ఏమీ ఉండదు.
ఎలా గుర్తించాలి? 
ఇతరత్రా ఏమైనా కారణాలతో ఛాతీ, కీళ్లు, తుంటికి సంబంధించిన ఎక్స్-రే తీసినప్పుడు ఎముకలు అరిగిపోయే, విరిగిపోయే లక్షణాలు కనిపిస్తాయి. ఎముకలు మామూలుగా ఉండాల్సిన దాని కన్నా పలుచగా, సన్నగా, పెళుసు గా కనిపిస్తే ఆస్టియో పొరోసిస్ గా అనుమానించాలి. శరీరంలో క్యాల్షియం, విటమిన్-డి తగ్గం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. ఇలాంటి వన్ని మధుమేహ బాధితుల్లో ఎక్కువగా జరిగే అవకాశం వుంది. అందుకనే, వైద్యులు ఇలాంటి మందుల్ని ముందు జాగ్రత్తగా సూచిస్తారు. ఆస్టియో పొరోసిస్ సమస్య ఉండేవారిలో 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కడైనా జారిపడితే తుంటి ఎముక విరిగి పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ముందస్తుగానే ఎక్స్-రే ద్వారా ఆస్టియోపొరోసిస్ తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించి, మందులు వాడితే మంచిది. ఇక పోతే.. మధుమేహం ఉన్నవారు, రక్తంలో షుగర్ స్థాయి పరీక్షించుకుంటూ, దానిని నియంత్రణలో ఉంచుకోవటానికి వైద్యుల సలహాతో ప్రత్యేకించి మందులు వాడడం కూడా అవసరమే.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top