కంప్యూటర్‌ ముందు ఎక్కువగా పనిచేస్తుంటే...

ApurupA
0
Sitting Jobs
చాలామంది గంటలతరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తుంటారు. ఇలా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఒకే పోజిషన్ లో కూర్చుంటే అది స్టాటిక్ లోడింగ్ అనే పరిస్థితికి దారితీస్తుంది. కేవలం అరగంటకే ఈ పరిస్థితి వస్తుంది. ఈ కండిషన్లో రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇలా కూర్చుండిపోయినప్పుడు వాళ్ల ఉచ్ఛాస్వ నిశ్వాస లు సైతం 30 శాతం మందగిస్తాయి. దాంతో ఆక్సిజన్పాళ్లూ 30 శాతం తగ్గుతాయి. అంటే... ఆ మేరకు శరీరానికి అవసరమైన ప్రాణవాయువు తగ్గడంతో కూర్చుని పని చేస్తున్న కొద్దిసేపటికే అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే వ్యాయామం తగ్గడం వల్ల కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే దీర్ఘకాలంపాటు అదేపనిగా కంప్యూటర్ పై పనిచేయాల్సిన వారు కొద్ది సేపటితర్వాత ఒకసారి లేచి కాసేపు పక్కన తిరగాలి. అలాగే నేరుగా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్ వైపు రెప్పవాల్చకుండా చూడకూడదు. ప్రతి పది నిమిషాలకు ఒకమారు కళ్లకు కాస్త విశ్రాంతినిస్తూ ఉండాలి. ఇలా కంప్యూటర్పై కూర్చుని పనిచేసేవారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఈ సూచనలను అనుసరిస్తే చాలావరకు మీరు చేసే తప్పుల సంఖ్య తగ్గుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top