గర్భిణుల్లో మధుమేహం

ApurupA
0
గర్భిణులకు మధుమేహం వస్తే కాన్పు తర్వాత  తగ్గిపోవచ్చు. అయితే, కాన్పు తర్వాత అయిదేళ్లు లోపు కనీసం సగం మందిలో మధుమేహం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఒకసారి గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం వచ్చిందంటే, తర్వాతి అయిదేళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. ఇతరత్రా మధుమేహుల మాదిరిగానే ఆహార నియమాలు, వ్యాయామాలు వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణుల్లో మధుమేహం వచ్చినప్పుడు, కాన్పు తర్వాత ప్రతి నెల రక్తపరీక్ష చేయించు కుంటుండాలి. అయిదేళ్లలో వస్తుందిలే అనే నిర్లక్ష్యం పనికి రాదు. ఏ నెలల్లో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువవుతుందో తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరం.

గర్భధారణలో వచ్చిన మధుమేహం అలాగే ఉండిపోయింది. అందుకని, ఆహార, వ్యాయామాల నియమాలు పాటిస్తూనే, మందులూ వాడడం శ్రేయస్కరం. ప్రస్తుత కాలంలో నిరంతరం మందులు వాడుతుండాల్సిందే. కొంతకాలం పాటు మానేసి చూద్దామనే ధోరణి ఎంతమాత్రం సరికాదు. ప్రస్తుతం వైద్య నిపుణులంతా సూచిస్తున్నదేమింటే, డయాబెటిస్ ను నియంత్రించే మందుల్ని ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. 25 ఏళ్లు లోపు మధుమేహం వచ్చిన గర్భవతుల్లో ఇన్సులిన్ తోనే నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. 25 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చిన వారిలో మధుమేహం ఉంటే గర్భిణిగా ఉన్నప్పుడు ఇన్సులిస్ తీసుకున్నా, కాన్పు తర్వాత మాత్రలతో నియంత్రించుకునే అవకాశం ఉంది. కానీ, 25 ఏళ్లు లోపే వచ్చి ఉంటే మాత్రం ఇన్సులిన్ తో మెట్ఫార్మిస్ వంటి మందులూ వాడుతూ ఆ తర్వాత రక్తంలోని స్ధాయిన్నిబట్టి ఇన్సులిస్ నిలిపి వేసే అవకాశాన్ని పరిశీలించవచ్చు. తర్వాత తర్వాత రెండుమూడు నెలల వరకూ రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంటే ఇన్సులిస్ ఆపేసి మందులు మాత్రమే వాడొచ్చు. గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంటే మాత్రం ఇన్సులిన్ ను కొనసాగించాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top