ఈ మధ్య ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్న సమస్య, ప్రతి ఒక్కరినీ బాధపెడుతూ ఉన్న సమస్య
అధిక కొవ్వు. ఈ కొలెస్టరాల్ మన శరీరంలో పెరిగిపోతే గుండెజబ్బు లాంటి
సమస్యలు వస్తాయి. మరి ఈ కొలెస్టరాల్‌ను తగ్గించుకోవడమెల? మన శరీరంలో కొవ్వు పెరిగిపోతే అది స్థూలకాయానికి దారి తీస్తుంది. దాన్ని అదుపులో ఉంచుకోకపోతే చాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కొవ్వును తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అసలు ఈ కొవ్వు ఎల తయారవుతుంది. దీన్ని ఎల తగ్గించుకోవాలి. చూద్దాం.
మనం తినే ఆహారంలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్ లు, పీచుపదార్థాలు, కొవ్వులు ఇల ఎన్నో పోషకాలు ఉంటాయి. మనం ఆహారం
తిన్న తర్వాత దానిని అది మన శరీరం క్యాలరీల కింద మార్చుకుంటుంది. మనకు అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటే దాన్ని శరీరం కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటుంది. ఆ కొవ్వు మరీ ఎక్కువైతే స్థూలకాయానికి దారి తీస్తుంది. దీని వల్ల శరీరంలోని అన్ని బాగాలలో కొవ్వు ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఫ్యాటీ లివర్, జీర్ణాశయ సంబంధిత సమస్యలు కూడా దీని వల్లే వస్తాయి. కొవ్వు ఎక్కువైతే అది రక్తనాళాల్లోనూ పేరుకుపోతుంది. రక్తప్రసరణకు అడ్డుపడుతుంది. దీని వల్ల శరీరంలోని ఒక బాగం నుంచి మరో బాగానికి రక్తప్రసరణ ఆగిపోతుంది. దీని వల్ల ఆ ప్రాంతంలోని కణాలు చనిపోతాయి. ఇదే ప్రక్రియ గుండెలో జరిగితే గుండె గోడల్లోని కణాలు చనిపోతాయి. అప్పుడు గుండె పోటు వస్తుంది. కొవ్వు వల్ల ఇన్ని
అనర్థాలున్నాయి కాబట్టే రోజువారీ మార్పులతో దాన్ని కరిగించుకోవాలి.
- ప్రతిరోజూ ఎక్సర్సైజ్ చేయడం, మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల కొవ్వును అదుపులో పెట్టుకోవచ్చు.
- కొన్ని రకాల మాంసాహార పదార్థాలు, మాంసం, గుడ్డు లోపలి పచ్చ సొన వంటి వాటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండం మంచిది.
- ఎక్కువగా ఫ్రై చేసిన పదార్థాలు, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
- నూనె పదార్థాలను తినడం మానేసి, తాజా పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, సలాడ్స వంటివి తీసుకోవడం మంచిది.
- కూరగాయలను నూనెలోగాని, నెయ్యిలో గానీ వేయించి తినకండి. వాటిని ఉడికించి, లేదా పచ్చివి తింటే మంచిది.
- తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఇల చేయడం వల్ల మన శరీరంలోని అనవసరమైన బరువు కూడా తగ్గించుకోవచ్చు.
- తక్కువ కొవ్వు ఉన్న ఆలివ్ ఆయిల్ వంటి నూనెలను మాత్రమే వంటకు ఉపయోగించాలి. పామాయిల్ లేదా కొబ్బరి నూనెలను వాడకుండా ఉంటే మంచిది. వీటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
- శరీరంలో పేరుకు పోయిన కొవ్వును ఎప్పటికప్పుడు తగ్గించుకోవడం, అసలు కొవ్వు పెరగకుండా చూసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా కా పాడుకోగలుగుతాం. దీని కోసం ఎప్పటికప్పుడు బీఎంఐ, కొలెస్టరాల్ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. దీని వల్ల సమస్యను మొదట్లోనే తుంచి వేయడం వల్ల భవిష్యత్తులో భయంకరమైన వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.