వీటితో మెన్సెస్ పెయిన్ నుండి ఉపశమనం

ApurupA
0
చాలామంది మహిళలకు రుతుస్రావం సమయంలో నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి నొప్పి తీవ్రంగా ఉండి చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. మెన్సెస్‌తో పాటు నడుం నొప్పి, వక్షోజాల నొప్పి కూడా రావచ్చు. పొత్తికడుపులో విపరీతమైన నొప్పి కూడా ఉండవచ్చు.

పరిష్కారం :
  • సరైన పోషకాహారం, సరళమైన వ్యాయామాలతో పీరియడ్ పెయిన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.
వీటితో పాటు చిన్నచిన్న చిట్కాలు పాటించి చూడండి.
  • పీరియడ్‌కు ముందు వారం రోజుల నుండి ఉప్పును తగ్గించండి.
  • మాంసాహారం తక్కువగా తింటే మంచిది. అంటే వారానికి ఒక్కసారి మాత్రమే తినవచ్చు.
  • మసాలా దినుసులు, కెఫేన్ ఉండే పానీయాలు అంటే టీ, కాఫీ, కొన్ని రకాల చాక్లెట్లు మరియు నూనె ఎక్కువగా వాడే వేపుళ్లు, వంటివి తినడం మానుకోవాలి.
  • కొబ్బరి నీరు అధికంగా తాగితే మంచిది.
  • నొప్పి అధికంగా ఉన్నప్పుడు కడుపు కింది భాగంపై వేడి నీళ్ల బాటిల్ పెట్టుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది.
  • నడుము కింద తలగడ ఉంచుకోండి.
  • ఉదయం పూట 10 తులసి ఆకులు నమిలి మింగి ఒక గ్లాసు నీరు తాగితే మంచిది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top