నాడి ఎలా కొట్టుకుంట్టుదంటే....

ApurupA
0
మన గుండె నిరంతరం లబ్ డబ్ మని కొట్టుకుంటూ ఉంటుంది. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం అందుతుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ వేగం మన శరీర సామర్థ్యాన్నే కాదు, గుండె ఆరోగ్యాన్నీ, ఇతర సమస్యలనూ పట్టి చూపుతుంది. అందువల్ల గుండె వేగం గురించి అవగాహన కలిగి ఉండం అవసరం. 
గుండె సాధారణ (నార్మల్) వేగం ఒక్కోకరిలో ఒక రకంగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ గుండె వేగంలో మార్పులొస్తాయి. మణికట్టు, మోచేయి, మెడ, పాదం పైన పల్స్ ను స్పష్టంగా గుర్తించ వచ్చు. ఈ బాగాల్లో వేలిని పెట్టి 60 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టు కుంటుందో లేక్కిస్తే గుండె వేగం తెలుస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన శరీరానికి రక్త సరఫరా అంతగా అవసరముండదు. కాబట్టి గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. ఎలాంటి జబ్బులూ లేని పెద్దవారిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె 60 నుంచి 100 సార్లు కొట్టు కుంటుంది. తీవ్రంగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి, క్రీడాకారుల్లో గుండె కండరం బలంగా ఉండం వల్ల విశ్రాంతి సమయంలో ఈ నాడి వేగం 60 కన్నా తక్కువగా ఉండొచ్చు. రక్తపోటును తగ్గించే మందులు, గుండె లయను సరిచేసే మందులు వేసుకునేవారు గుండె వేగంపై ఓ కన్నేసి ఉంచం మంచిది. ఇలాంటి వారిలో ఏమైనా తేడాలు కనిపిస్తే మందుల మోతాదు మార్చడమో, వేరే మందులకు మారడమో చేయాల్సి ఉంటుంది. గుండె వేగం చాల తక్కువగా ఉన్నా, తరచుగా గుండె వేగం పెరుగుతున్నా, ముఖ్యంగా బలహీనత, తల తిప్పుడం, వణుకు వంటివి ఉంటే వెంటనే డాక్టర్ కి చూపించు కోవడం మంచిది. ఏమైన సమస్యలుంటే ముందుగానే జాగ్రత్త పడే అవకాశముంటుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top