ప్రసవ
సమయంలో తల్లితోపాటు శిశువు కూడా శ్రమకు గురవుతాడన్న విషయం తెలిసిందే. జన్మించిన
పిదప సేదదీరడం కోసం మూడు నాలుగు గంటలపాటు శిశువుకు విశ్రాంతి నివ్వాలి. ఏమీ
తాగించనవసరం లేదు. అనంతరం శిశువు ఆరోగ్యం బాగుందని నిర్ధారణ చేసిన పిదప తల్లి పాలు
ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలా పాలు తాగగలగడం శిశువునకు సంక్రమించే సహజసిద్ధమైన
ప్రక్రియ. తల్లి సంతోషంతో శిశువును చూడటం, తాకడం, స్తనాన్ని నోటికి అందించడం ‘స్తన్యం’ స్రవించడం
సఫలమవుతుంది. తన కెంత కావాలో శిశువుకి తెలుసు. అనంతరం తల్లి ప్రయత్నించినా తాగడు.
అది గుర్తించి బలవంతంగా తాగించవద్దు. శిశువు ఏడవడానికి చాలా కారణాలుంటాయి. అందులో ‘ఆకలి’ కూడా
ఒకటి. ముర్రు పాలు (కొలొస్ట్రమ్) శిశువుకు చాలా మంచిది. బలకరం. విరేచనం సాఫీగా
అయ్యేట్టు చేస్తాయి.
బిడ్డకు ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు స్తన్యం తాగించాలి.
ఆరవ నెలలో ఫల ప్రాశన, పదవ నెలలో
అన్నప్రాశన తప్పనిసరి. ఇతర పోషకవిలువలు బిడ్డకు అందించడానికి ఇది చాలా అవసరం.
సరియైన ఫలాలు లభించకపోతే ఆరవ నెలలోనే అన్నప్రాశన చేయవచ్చు. తల్లి పాలు తక్కువయిన పక్షంలో ఆవుపాలు లేదా మేక పాలు అందించవచ్చు.
వీటిలో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఒక చిటికెడు పసుపు వేసి మరిగించి, చల్లార్చి, చక్కెర కలిపి
తాగించవచ్చు.
- తల్లికి జ్వరం గాని, రొమ్ముపై స్థానికంగా రోగాలు గాని ఉన్నప్పుడు తాత్కాలికంగా బిడ్డకు పాలుపట్టడం ఆపడం మంచింది.
- ప్యాకెట్ పాలు గాని, డబ్బా పాలు గాని తెచ్చుకోవడం అనివార్యమైతే అవి ‘కల్తీ’లేనివని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం.
- ‘నువ్వులు, బెల్లం, వెల్లుల్లి, తాజా ఫలాలు, పాలు సేవిస్తే తల్లికి స్తన్యోత్పత్తి పుష్కలంగా జరుగుతుంది. ముడి బియ్యంతో వండిన అన్నం మంచిది.
- ఎల్లప్పుడు సాత్వికాలోచన, సంతోషంగా ఉండడం మంచిది.