ఆవలింత లేదా ఆవులింత ఎరుగని మనుషులు వుండరు. మనుషులే గాక పిల్లులు, కుక్కలు, ఇతర కొన్ని జంతువులు కూడా నోరంతా తెరిచి ఆవులించడం జరుగుతుంది. ఆవులించేటప్పుడు నోరంతా పెద్దగా తెరచు కుంటుంది. ఆవులింతలు నిద్రకు ఆరంభ చిహ్నంగా కొందరు భావిస్తారు. సుష్టుగా తిన్నప్పుడు లేదా బాగా అలసిపోయినప్పుడు కూడా అవలింతలు వస్తాయి. ఇది అసంకల్పిత కండర చర్య అంటే మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఇవి ఎందుకు వస్తాయంటే శ్వాసక్రియ జరగవలసినంత వేగంగా జరగకుండా వున్నప్పుడు దేహనికి గాలి సరఫరా తగ్గిందని మెదడు గుర్తిస్తుంది. ఎక్కువ గాలిని తీసుకోమని శ్వాసక్రియను ఆజ్ఞాపిస్తుంది. అందువల్ల ఎక్కువ గాలిని లోపలికి గ్రహించేందుకు వీలుగా రెండు దవడలను వెడల్పుగా చాపి, నోరు తెరచకునేట్లు చేస్తాము. దీన్నే ఆవులింత అంటారు. విసుగు, ఆతృత ఎక్కువ అయినప్పుడు,అలసి పోయినప్పుడు శ్వాస క్రియ జరగవలసినంత వేగంగా జరగదు. ఆవులింత దీన్ని భర్తీ చేస్తుంది. ఆవులింత వల్ల శరీరానికి కొంత రిలాక్సేషన్ కలుగుతుంది
ఆవులింత ఎందుకు వస్తుంది?
September 01, 2014
0

Tags
Share to other apps