కాఫీ గురించి కొన్ని విషయాలు...

ApurupA
0




మనకు సంబంధించినంత వరకు కాఫీ చూడటానికి ఆకర్షణీయంగా, చిక్కటి రంగుతో, పొగలుకక్కుతూ, రుచికరమైన సువాసనను వెలువరుస్తూ చూడగానే తాగాలనిపిస్తుంది. అంతవరకే మనకు తెలిసింది. కానీ అదెంతో సంక్లిష్టమైన పానీయం. ఒక కప్పు కాఫీలో వందల కొద్దీ జీవసంబంధ మైన పదార్థాలున్నాయి. అందులో కొన్ని చురుకైనవి. ఉదాహరణకు కెఫిన్, డైటర్పిన్స్, డైఫీనాల్స్ వంటివి. ఒక కప్పు కాఫీ తాగగానే హృదయ స్పందనల విషయంలో దాని ప్రభావం ఉంటుంది. అయితే ఆ ప్రభావం ఏమేరకు అన్నది, వ్యక్తిగతంగా తాగేవారికి ఉన్న కొన్ని వ్యాధులు, లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే కాఫీ ఎలా తయారు చేశారు అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే... అది ఫిల్టర్ కాఫీయా లేక సాధారణ కాఫీయా అన్న అంశంపైన అన్నమాట.


కెఫిన్ ప్రభావం:
 కాఫీలో ఉండే కెఫిన్ చాలా ప్రధానమైన ఉత్ప్రేరకం. మనం కాఫీ తాగగానే ఏమవుతుందంటే : కాఫీ ఒంట్లోకి ఇంక గానే దాని ప్రభావం శరీరంపై, ఆరోగ్యంపై కనిపిస్తుంది. కాఫీ తాగిన కాసేపట్లో రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ బ్లడ్ ప్రెషర్) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే, అది సాధారణం కంటే 8 ఎంఎం/హెచ్జీ ఎక్కువవుతుంది. డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీ తాగిన తర్వాత సుమారు గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ తాగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంతగా తాగాలనిపిస్తే కొద్ది మోతాదులో మాత్రమే తమ జిహ్వను సంతృప్తి పరచడానికి తీసుకోవాలి. ఎందుకంటే... 
 ఇలా కాఫీ ఎక్కువగా తాగుతూ బీపీని పెంచుకోవడం వల్ల దీర్ఘకాలికంగా దాని దుష్ర్పభావాలు ఉంటాయి. ఎందుకంటే కాఫీ తాగిన ప్రతిసారీ కెఫిన్ విషయంలో కొంత నిరోధకత (టాలరెన్స్) పెరుగుతూ ఉంటుంది. అంటే మొదటిసారి కాఫీ తాగినప్పుడు కలిగే ఉత్తేజం, రెండో కాఫీకి తగ్గుతుందన్న మాట. అందుకే రెండోసారి కూడా అంత ఉత్తేజం పొందాలనుకుంటే రెండోసారి కాస్త ఎక్కువ తాగాలన్నమాట. ఇలా కాఫీ ఇచ్చే ఉత్తేజానికి అలవాటు పడ్డప్పుడు క్రమంగా మోతాదును పెంచుకుంటారు. ప్రధానంగా పరీక్షల కోసం చదివే పిల్లలు రాత్రుళ్లు చురుగ్గా ఉండటం కోసం, నిద్రమత్తును దూరం చేసుకోవడం కోసం దీనిపై ఆధారపడతారు.
 కాఫీని కేవలం పానీయంగానే పరిగణించకూడదు. ఎందుకంటే ఇందులో మైగ్రేన్ తల నొప్పిని తగ్గించే యాంటీ మైగ్రేన్ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగాక రెండో దానికి వ్యవధి ఇవ్వాలి. లేకపోతే అవసరం లేని మందును/మాత్రను వేసుకుని దాని సైడ్ ఎఫెక్ట్స్ను పొందడమేనని గుర్తుంచుకోవాలి. అలాగే కాఫీ... యాంగ్జైటీని పెంచుతుంది. కొందరిలో వణుకును కూడా పెంచుతుంది. అందుకే యాంగ్జైటీతో బాధపడేవారు కాఫీని తాగకపోవడమే మంచిది. ఇక ఎస్ప్రెస్సో కాఫీతో ఆరోగ్యానికి జరిగే హాని అంతా ఇంతా కాదు. డైటర్ పీన్ ప్రభావం: కాఫీలో ఉండే డైటర్ పీన్ ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో చూద్దాం. కాఫీలో ఉండే ఈ జీవరసాయనం శరీరంలోకి ప్రవేశించ గానే అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పాళ్లను, హానికరమైన ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను అకస్మాత్తుగా పెంచేస్తుంది. ఇక ఫిల్టర్ కాఫీలో డైటర్పీన్స్ పెద్దగా ఉండవు. ఎందుకంటే వడపోత ప్రక్రియలో ఇవి కాఫీలోకి వెళ్ల కుండా, ఫిల్టర్ కాగితంపైనే ఉండిపోతాయి. కానీ ఫిల్టర్ చేయని కాఫీలో మాత్రం డైటర్పీన్ పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే కేవలం హైపర్టెన్షన్ ఉన్నవాళ్లు మాత్రమే గాక... శరీరంలో కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉన్నవారు కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మామూలు కాఫీకి బదులుగా ఫిల్టర్ కాఫీని ఒక కప్పు మాత్రం తీసుకోవచ్చు.
మంచి గుణాలు లేవా?  కాఫీ ఎప్పుడూ హానికరమేనా?
ఇందులో మంచి గుణాలు లేవా? కాఫీ ప్రియులు అంతగా నిరాశ పడనక్కర్లేదు. ఎందుకంటే కాఫీని పరిమిత మోతాదులో తీసుకుంటే అది పక్షవాతాన్ని (స్ట్రోక్ని) నివారిస్తుంది. కాఫీలోని డైఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఈ పని చేస్తుంది. ఐదు లక్షల మంది కాఫీ ప్రియులపై విస్తృతంగా చేసిన అధ్యయనాలలో ఈ విషయం తెలిసింది. అయితే ఈ ప్రయోజనాన్ని పొందడానికి కాఫీని కేవలం రోజుకు రెండు కప్పులకు మాత్రమే పరిమితం చేసుకోవాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top