మానసిక ఒత్తిడిని అధిగమించండి ఇలా...

ApurupA
0
మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా దాన్ని అధిగమించడం, నియంత్రిం చడం. దీనివల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని తేలింది కూడా. ఉదాహ రణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని సమర్థంగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారిం చుకోగలగడం సాధ్యమేనని తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలివి...

  • ఒత్తిడికి కారణాన్ని గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. దాంతోపాటు ఒత్తిడిని దూరం చేసుకోడానికి మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలివి... ? చాలా లోతుగా గాలి పీల్చడం వంటి బ్రీతింగ్ వ్యాయా మాలు చేయడం ? ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడం. 
  • ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కార ణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా చేయగలిగింది ఉండదని, కాబట్టి ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని సర్దిచె ప్పుకోవడం 
  • పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యల ను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.ఏ శారీరక లక్షణాల ద్వారా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించవచ్చు.
కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ మనకు అది తెలియకపోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలు సైతం ఒత్తిడిని గుర్తించేలా చేస్తాయి. అవి...


1. నిద్రపట్టకపోవడం 
2. ఆకలి లేకపోవడం 
3. కండరాలు బిగుతుగా పట్టేయడం. 
4.మాటిమాటికీ తలనొప్పి 
5. జీర్ణకోశ సమస్యలు
6. దీర్ఘ కాలంగా దిగులు, బాధ లాంటివి ఉండి ఎంతకూ తగ్గకపోవడం. 

ఇవి కనిపిస్తున్నప్పుడు ఆ శారీరకబాధలు చిన్నవే కదా అంటూ నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించి మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలకు దారితీయకముందే జాగ్రత్తపడాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top