ఊపిరి తిత్తుల సమస్య వలన ఉబ్బసం వ్యాధి వస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అలర్జీ కలగడం వల్ల కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఈ అలర్జీలు అందరిలోనూ ఓకే లా ఉండవు.
కొంతమంది కి నిమ్మ జాతి పండ్లు, మరికొంత మందికి పాలు, కోడిగుడ్డు, గోధుమలు, వేరుశనగలు, చేపలు, పిండి పదార్థాలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు తింటే అలర్జీ రావచ్చు. శరీరంలో చెక్కర శాతం తగ్గినా ఈ సమస్య లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లు ముఖ్యంగా ప్రాసెర్డ్ ఫుడ్, ప్యాక్ డ్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల వాటిలోని సల్ఫేట్ లు, బెంజైట్ ల వల్ల ఆస్తమా లక్షణాలు మరింత పెరగొచ్చు. అందుకని శీతల పానీయాలు, చిప్స్, సాస్, నిల్వ చేసిన ఆహారపదార్థాలు, పళ్ళ రసాలు తగిస్తే సమస్య కొంత వరకు అదుపులో ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు ఒకే ఆహారం తీసుకోవడం వల్ల ఆస్త్మా రాకపోవచ్చు. ఫుడ్ డైరీ ఒకటి పెట్టుకొని ఏయే పదార్థాలు తింటే అలర్జీ వస్తోందే ఎప్పటికప్పుడు రాసుకుంటే మీకు ఓ అవగాహన ఏర్పడుతుంది.