కిడ్నీ (మూత్రి పండాలు) ల్లో రాళ్లు ఏర్పడినట్లు అప్పుడప్పుడు వింటుంటాం. కిడ్నీల్లోనే గాక కాలేయంలో, పిత్తాశయంలో కూడా రాళ్లు ఏర్పడవచ్చు. ఇవి మనం ఆహారంలో పొరపాటున తీసుకునే రాళ్లు కావు, శరీరంలో కొన్నిరకాల ఆసిడ్స్ (ఆమ్లాలు), ఇతర పదార్థాల వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి. ఇవి చిన్న గుండు సూది తల నుండి కోడిగుడ్డు సైజు వరకు రకరకాల సైజుల్లో వుంటాయి. వైద్యపరిభాషలో ఈ రాళ్లను కాలిక్యులై అంటారు. ఈ రాళ్లు మూత్ర వాహికలో ఇన్ఫెక్షన్లు వున్నప్పుడు, మూత్రం నిల్వ వుండి పోయినప్పుడు, తగినంత నీరు తాగకపోవడం, ఆసిడ్ కలుగజేసే పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఏర్పడతాయి. మూత్రంలో ఆమ్లగుణాలు ఎక్కువగా వుంటే సోడియం యూరేట్, యూరిక్ ఆసిడ్, ఫాస్పేటులు గల రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలో క్షారగుణం వుంటే కాల్షియం ఫాస్పేటు, అమోనియం యూరేట్, మెగ్నీషియం, ఫాస్పేటులతో కూడిన రాళ్లు ఏర్పడతాయి. రాళ్లు ఏర్పడినపుడు తీవ్రంగా కడుపునొప్పి వస్తుంటుంది. వివిధ రసాయనాలతో పాటు చెడు బ్యాక్టీరియా, ఎపితీలియల్, చీముకణాలు రాళ్లను మరింత దృఢతరం చేస్తాయి.
కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి?
October 11, 2014
0
Tags
Share to other apps