వ్యాయామానికి ముందు తీసుకోవలసిన ఆహారం...

ApurupA
0
బరువు తగ్గడానికి వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో.. వ్యాయామం చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామన్నది కూడా అంతే ముఖ్యం. కాని మనం దీనిని అంతగా ప్రాముఖ్యం ఇవ్వము. లావు తగ్గడంలో వ్యాయామం చేసే ముందు తీసుకునే ఆహారం పాత్ర కూడా చాలానే ఉంటుందంటారు నిపుణులు. వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చుద్దామా...

అరగంట ముందే.. 

సాధారణంగా అయితే వ్యాయామం చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడమే మంచిది. కానీ వ్యాయామం చేయడానికి కూడా ఎంతో కొంత శక్తి కావాలి కదా అని చాలామంది ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు వ్యాయామం చేయడానికి అరగంట ముందు ఆహారం తీసుకోవాలి. అంతేగానీ తిన్న వెంటనే ఎలాంటి ఎక్సర్‌సైజులు చేయకూడదు. అలాగే అరగంట ముందు తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి మన శరీరంలోని జీవక్రియలకు ఇంధనంలా పనిచేస్తాయి.

పండ్ల రసాలు.. 
నారింజ, యాపిల్‌, బత్తాయి.. లాంటి పండ్లను జ్యూస్‌ చేసుకుని తాగి అప్పుడు వ్యాయామం మొదలు పెట్టండి. ఇలా చేస్తే శరీరానికి తాజాదనంతో పాటు తక్షణ శక్తి అందుతుంది. జ్యూస్‌ తాగవచ్కు కాదా అని అందులో ఎంత పడితే అంత చక్కెర కలపకండి. ఎందుకంటే చక్కెర ఎక్కువగా కలిపితే లావయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత మేరకు చక్కెర లేకుండా తాగండి.. లేదా కొద్దిగా కలుపుకుని తాగడానికి ప్రయత్నించండి.

ఉడకబెట్టిన గుడ్లు.. 
కోడిగుడ్లలో ఉన్నన్ని పోషకాలు ఇంక ఎందులోనూ ఉండవేమో! ముఖ్యంగా ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎక్సర్‌సైజ్‌కు ముందు రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లని తింటే మంచిది.

తగినన్ని నీళ్లు..!! 
మన శరీరానికి నీరు చాలా ముఖ్యమైంది. వ్యాయామం చేయడానికి కనీసం ఒక గంట ముందు కనీసం అరలీటర్‌ నీరు తాగాలి. ఎందుకంటే ఇది శరీరాన్ని డీహైడ్రేషన్‌ నుంచి కాపాడుతుంది.
అరటిపండు.. 
శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో అరటిపండును మించిన ఆహార పదార్థం లేదంటే నమ్మండి.. చాలామంది అరటిపండు తింటే లావవుతారనే అపోహలో ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే అరటిపండు తినడం వల్ల అందులో అధిక శాతంలో ఉండే చక్కెర గ్లూకోజ్‌గా మారి శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. అందుకే ఎక్సర్‌సైజ్‌కి ముందే దీన్ని తీసుకోవడం మంచిది.
ఓట్‌మీల్‌.. 
వ్యాయామానికి ముందు ఓట్‌మీల్‌ తింటే చాలా మంచిది. పాలల్లో ఉడికించిన ఓట్స్‌లో కొన్ని కిస్‌మిస్‌లను వేసుకుని తింటే రుచిగా ఉంటుంది. అలాగే ఓట్స్‌ తినడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గొచ్చు.
పెరుగు, పండ్ల ముక్కలు.. 
ఒక కప్పు వెన్నతీసిన పెరుగులో కొన్ని రకాల పండ్ల ముక్కల్ని వేసుకుని తినొచ్చు. అరటిపండు, స్ట్రాబెర్రీ, దానిమ్మ లాంటి పండ్లను పెరుగుతో కలిపి తీసుకుంటే మన మన శరీరానికి అధిక శక్తి అందుతుంది.
హోల్‌గ్రెయిన్‌ బ్రెడ్‌.. 
ఒక హోల్‌గ్రెయిన్‌ బ్రెడ్‌ స్త్లెస్‌లో ఎక్కువ మొత్తంలో కార్బొహైడ్రేట్లు ఉంటాయి. దీన్ని తేనె లేదా జామ్‌తో తినొచ్చు. శరీరానికి ప్రొటీన్లు కూడా అందాలంటే ఉడికించిన కోడిగుడ్డును స్త్లెసుల్లా చేసుకుని ఈ బ్రెడ్‌ స్త్లెసుల మధ్య పెట్టుకుని తింటే సరిపోతుంది.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top