వయసు పెరగడంతో వచ్చే మార్పులు

ApurupA
0
నిత్యం యవ్వనంతో ఉండటం కంటే మరో వరం లేదు. ముఖ్యంగా వయసు తెలిసిపోయేది చర్మంతోనే. తెల్లబడే తలకు రంగు వేసైనా వృద్ధాప్యాన్ని కనిపించకుండా ఆపవచ్చేమో గాని, ముడుతలు పడే చర్మానికి ఏం చేసి వృద్ధాప్య లక్షణాలను ఆపగలం? చర్మంపై త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనబడటానికి కారణాలు, వాటిని నివారించేందుకు తీసుకు వాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవాలనుకునే వారి కోసమే ఈ కథనం.
చర్మం మన దేహంలోని అతి పెద్ద అవయవం. సూర్యుడి హానికారక కిరణాలనుంచి, వాతావరణంలోని వేడిమి/చలి నుంచి, అనేక సూక్ష్మక్రిములనుంచి రక్షణ కల్పిస్తుంది చర్మం. అదే లేకపోతే ఏ జీవి మనుగడా సాధ్యం కాదు. ఇలా రక్షణ కల్పించే ప్రక్రియలో దానికి అయ్యే హానిని అదే తొలగించు కుని, దానికి అయ్యే గాయాలను అదే చక్కబరచుకుంటుంది. ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్‌ చేసుకుంటుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వయసు తాలూకు అనేక మార్పులు కనిపిస్తాయి. చర్మంపై కాల ప్రభావాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అంతర్గతంగా వచ్చే మార్పుల (ఇంట్రిన్సిక్‌) తాలూకు కారణాలు, రెండోది బాహ్య కారణాలు (ఎక్స్‌‌రటిన్సిక్‌). వయసు పైబడటానికి అంతర్గత (ఇంట్రిన్సిక్‌) కారణాలు కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులకు ప్రధాన కారణం జన్యువుల్లో ఉంటుంది. కొందరు... ముఫ్ఫైలలో ఉన్నా టీన్స్‌లో ఉన్నట్లే కనబడతారు. దానికి కారణం వారి జన్యువులే.
ఇలా అంతర్గత కారణాలతో జరిగే వయసు మార్పులను ‘స్వాభావిక వయసు మార్పులు’ (నేచురల్‌ ఏజింగ్‌) అంటారు. మన చర్మం బిగుతుగా ఉండటానికి కారణం... అందులో కొలాజెన్‌ అనే పదార్థం. ఈ కొలాజెనే చర్మం కణాలను పట్టి ఉంచినట్లుగా బిగుతుగా ఉంచడానికి సపోర్ట్‌ ఇస్తుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ కొలాజెన్‌ ఉత్పత్తి మందగిస్తూ పోతుంటుంది. అలా మందగిస్తున్నకొద్దీ... చర్మాన్ని సాగదీసినప్పుడు మళ్లీ యథాస్థితికి వచ్చే గుణం (ఎలాస్టిసిటీ) తగ్గివదులుగా మారుతుంది. ఇక చర్మంపైన మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోయి, ఆ స్థానంలో మళ్లీ కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మృతకణాల స్థానాన్ని తీసుకునే కొత్త కణాల ఉత్పత్తి కూడా మందగిస్తుంటుంది. ఈ మార్పులన్నీ 20 తర్వాత నుంచి కనిపిస్తుంటాయి కాబట్టి ఏజింగ్‌ ఆ వయసు నుంచే మొదలవుతుంది.

వయసు పెరగడంతో వచ్చే స్వాభావిక మార్పులివి... 
  • చాలా సూక్ష్మమైన ముడుతలు (సాధారణంగా నుదు టిమీదపై ప్రస్ఫుటంగా కనిపిస్తాయి) 
  • చర్మం క్రమంగా పారదర్శకం కావడం 
  • చర్మం కింద ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుండటంతో చెంపల భాగంలో గుంటలు పడటం.
  • అలాగే కంటి చుట్టుపక్కల ఉన్న చర్మం కింది కొవ్వు కూడా తగ్గుతూ పోతుంది. అలాగే అరచేతుల వెనక భాగంలో,మెడ దగ్గర చర్మం వదులవుతూ ఉంటుంది 
  • కాలక్రమాంలో ఎముక కాస్తంత కురచగా మారడంతో ఎముక చుట్టూ ఉండే చర్మం వదులవుతుంది
  • పొడిగా ఉండే చర్మంలో దురదలు వస్తాయి. (అక్కడి గ్రంథుల సంఖ్యతగ్గడం వల్ల). 
  • స్వేదగ్రంథుల సంఖ్య తగ్గడంతో చెమటలు తగ్గి శరీరాన్ని చల్లబరిచే గుణం క్రమంగా తగ్గుతుంది.
  • శరీరంపై ఉండే వెంట్రుకలు క్రమంగా తెల్లబడతాయి. హార్మోనల్‌ మార్పుల వల్ల తలపై (మాడు భాగంలోని) వెంట్రుకలు క్రమంగా పలచబడతాయి. ఈ మార్పు స్ర్తీ, పురుషులిద్దరిలోనూ చోటుచేసుకుంటుంది 

ఇకస్ర్తీలలో అవాంఛనీయమైన వెంట్రుకల పెరుగుదల ఎక్కువ వుతుంది. (ఈస్ట్రోజెన్‌ తగ్గడం వల్ల)  గోళ్ల చివర అర్థచంద్రాకారంలో ఉండే తెల్లటి భాగం క్రమంగా మాయమై పోయి, గోళ్లపై చిన్న చిన్న గాట్ల వంటివి ఏర్పడుతుంటాయి. అయితే పై మార్పులు కొందరిలో ఇరవైలలో కాకుండా నలభైల్లోకి వచ్చే వరకూ ప్రారంభం కావు. ఇక కొందరిలో వయసు పెరగడం అనే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. దీనికీ జన్యువులే కారణం. ఈ కండిషన్‌ను ‘వీనర్స్‌ సిండ్రోమ్‌’ అంటారు ఈ సిండ్రోమ్‌తో బాధ పడేవారిలో వెంట్రుకలు టీనేజ్‌లోనే తెల్లబడతాయి. ముప్ఫయిలలో క్యాటరాక్ట్‌ వస్తుంది. 

వయసు పైబడటానికి బయటి కారణాలు (ఎక్స్‌ట్రిన్సిక్‌) 

వయసు పైబడినట్లుగా కనిపించడానికి అనేక  కారణాలు దోహదం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి...

సూర్యుడికి ఎక్స్‌పోజ్‌ కావడం : సూర్యుడి కిరణాలకు ఎక్స్‌ పోజ్‌ కావడం వల్ల చర్మం కొన్ని మార్పులకు గురవుతుంది. కమిలినట్లుగా మారడం, ప్రెకిల్స్‌ (చిన్న చుక్కల్లా కనిపించే గోధుమ రంగు మచ్చలు), ఏజ్‌ స్పాట్స్‌, చర్మంపై సన్నటి ముడుతలు కనిపిస్తాయి. చర్మాన్ని సాగదీసినప్పుడు ఇవి మాయమౌతాయి. కొన్ని సందర్భాల్లో కాస్త ఎరగ్రా, గరుకుగా కనిపించే పులిపిరి కాయల్లాంటి యాక్టినిక్‌ కెరటోసిస్‌ వల్ల వయసు ఉన్నదాని కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తర్వాతి దశలో చర్మ క్యాన్సర్‌కూ దారితీయవచ్చు సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల వయసు పైబడినట్లుగా మారడాన్ని ‘ఫొటో ఏజింగ్‌’ అంటారు. ఒకరి చర్మం ఫొటో ఏజింగ్‌కు గురికావడం అన్నది మళ్లీ ఆ వ్యక్తి చర్మపు రంగుతో పాటు అతడు ఎంతసేపు ఎండవేడికి ఎక్స్‌పోజ్‌ అవుతున్నాడనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫెయిర్‌గా (తెల్లటి/ఎరట్రి చర్మపు రంగుతో) ఉండేవారికి చర్మంలో మెలనిన్‌ అనే పదార్థం తక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా గురవుతుంటారు. ఇక చర్మం డార్క్‌గా మారుతున్న కొద్దీ పై దుష్ర్పభావాలు తగ్గుతాయి. సూర్యరశ్మి తాలూకు దుష్ర్పభావాలకు చర్మం గురికావడం అన్నది కాలక్రమేణా జరుగుతుంటుంది. దీనివల్ల చర్మం నల్ల బడటం, మందంగా మారడం, ముడుతలు పడటం జరుగుతుంది. అదేపనిగా సూర్యుడికి ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల పై మార్పులన్నీ శాశ్వతం అయ్యే అవకాశమూ ఉంది. అందుకే వేడి ప్రదేశాల్లో నివసించేవారిలో ఏజింగ్‌ మార్పులన్నీ వారి ఇరవైలలోనే కనిపించడం మొదలవుతుంది.


సూర్యరశ్మివల్ల కలిగే ఏజింగ్‌ ప్రక్రియ నివారణకు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top