ఒత్తిడి కారణంగా వచ్చే సమస్యలు :

ApurupA
0
ఒత్తిడి అనేది కేవలం మనల్ని ఇబ్బంది పెట్టే ఆ సమయంలోని మానసిక స్థితి మాత్రమే కాదు. దానివల్ల కొన్ని శారీరకమైన మార్పులూ వస్తాయి. ఫలితంగా శరీరం దెబ్బతింటుంది. అది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం.
ఒత్తిడి కారణంగా వచ్చే పది పాపులర్ సమస్యలు :
1. గుండెజబ్బులు: పైన పేర్కొన్నట్లుగా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘ కాలిక గుండెజబ్బులు ఎక్కువగా ఉండటం చాలా సాధారణమైన విషయం. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే.
2. ఆస్తమా: ఒత్తిడి ఆస్తమాను ప్రేరేపిస్తుందని ఇప్పటికే వైజ్ఞానిక శాస్తపరంగా రుజువైంది. అంతేకాదు... తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లలకూ హాని చేస్తుందని తేలింది. ఒకవేళ తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారే అయితే వారి పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశాలు చాలాఎక్కువని అధ్యయనాల్లో తేలింది. అంటే... తమ
ఒత్తిడి వల్ల వారు తమనే కాకుండా తమ సంతతిని, ముందు తరాలవారినీ బాధిస్తున్నారన్నమాట. గర్భవ
తిగా ఉన్నవారిలో కొందరిని ఎంపిక చేసుకుని ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో సగం మందిని ఒత్తిడికి, మరో సగం మందిని కాలుష్యపు పొగకు ఎక్స్పోజ్ అయ్యేలా చేశారు. ఈ అధ్యయన ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన వారి కంటే... ఒత్తిడికి గురైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో అత్యధికులకు ఆస్తమా సోకింది. 
3. స్థూలకాయం: మన శరీరంలో కొవ్వు పేరుకునే ప్రాంతాల్లో... తొడలు, పృష్టభాగం కంటే పొట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ ఒత్తిడి వల్ల పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడం ఎక్కువగా జరుగుతుంది. తద్వారా ఆరోగ్య హాని కూడా ఎక్కువేనన్నమాట. అంటే ఒత్తిడి వల్ల రెండు రకాల నష్టాలని గుర్తించాలి. మొదటిది పొట్ట రావడం, రెండోది ఆ పొట్ట వల్ల ఆరోగ్యభంగం జరగడం.
4. డయాబెటిస్: తీవ్రమైన మానసిక ఒత్తిడి... డయాబెటిస్కు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. మళ్లీ ఇది రెండురకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా ఆకలి పెరిగి... మనం తినకూడని అనారోగ్యకరమైన పదార్ధలైన వేపుళ్లు, బేకరీ పదార్థాలు తినేలా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ పాళ్లు పెరగడం కారణంగా మనం అనారోగ్యానికి గురవుతాం. ఇలా ఒక అనారోగ్యం మరో ప్రతికూలతకూ, ఆ ప్రతికూలత మరో అనారోగ్యానికీ ఒక చక్రంగా సాగిపోతూ అనారోగ్యపు ఊబిలోకి దించుతూపోతుంది.
5. తలనొప్పి: ఒత్తిడివల్ల కొన్ని తలనొప్పులూ, మైగ్రేన్ రావడం సహజం. వాటి కోసం వాడే నొప్పి నివారణ మందులతో కొన్ని దుష్ఫలితాలు రావడం సాధారణం. వాటితో మరింత అనారోగ్యం కలగడం మరింత సర్వసా ధారణం. ఇలా ఒకటికొకటి తోడవుతూ ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీయడం అన్నది ఒత్తిడి తాలూకు మరో చెడు లక్షణం.
6. డిప్రెషన్, యాంగ్జైటీ: ఒత్తిడికి గురైన వారుఉద్వేగాలకు లోనవుతుంటారు. ఇలాంటివారిలో యాంగ్జైటీ కనిపించడం మామూలే. ఇలా దీర్ఘకా లిక భావోద్వేగాలకు గురయ్యేవారిలో 80 శాతం మంది ఒత్తిడులకు లోనవుతుంటారు. వీరిలో చాలామంది కొంతకాలం తర్వాత తీవ్ర నిరాశ, నిస్పృహలకూ దీర్ఘకాలంలో డిప్రెషన్కు లోనైన దాఖలాలు చాలా ఉన్నాయి.
7. జీర్ణకోశ సమస్యలు: ఒత్తిడికి గురయ్యేవారిలో చాలామంది జీర్ణకోశ సమస్యలకు గురవుతుండటం సాధారణం. వీరిలో చాలామందికి ఒత్తిడికి గురికాగానే కడుపులో యాసిడ్స్ స్రవించి మంట రావడం, అలా మంటలు వచ్చే వారిలో చాలామందికి దీర్ఘకాలంలో కడుపులో అల్సర్స్ కనిపిస్తాయి. ఇలా గ్యాస్ పైకి తన్నేవారికి ఛాతీలో నొప్పి రావడం చాలా సాధారణంగా కని పించే పరిణామం. ఆ సంకేతాన్ని కొన్నిసార్లు గుండెపోటుగా పొరబడటమూ చాలామందిలో చూస్తుంటాం. ఇలా దీర్ఘకాలం గ్యాస్ పైకి ఎగదన్నుతుండేవారు గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అనే శారీరక రుగ్మతకూ లోనవుతుంటారు. ఈ దుష్పరిణామాలన్నీ ఒత్తిడి కారణంగానే జరుగుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
8. అల్జైమర్స్ డిసీజ్: ఒత్తిడి కారణంగా మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అల్జైమర్స్ డిసీజ్కు దారితీస్తుందని కొన్ని అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ఒత్తిడి వల్ల అల్జైమర్స్ డిసీజ్ తీవ్రం కావడం చాలా
వేగంగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అల్జైమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని గుర్తించాలి. పైగా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది తీవ్రమయ్యే వేగం కూడా పెరుగుతుందని గ్రహించాలి.
9. వేగంగా వయసు పైబడటం: ఒత్తిడి వల్ల త్వరగా వృద్ధులైపోయే మరో దుష్పరిణామం కనబడుతోంది. తల్లుల, పిల్లల డీఎన్ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైనవారు, తమ తల్లులతో పోలిస్తే వేగంగా వృద్ధాప్య దశకు సమీపించి నట్లు, వారిలో వృద్ధాప్యలక్షణాలు చాలా త్వరగా కనిపించినట్లుగా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అంటే... ఒకరు ఆ వయసుకు కనబరచాల్సిన లక్షణాలను 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
10. చాలా ముందుగా మరణించడం (ప్రీ-మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం మామూలే. అయితే కొందరిలో మరణించాల్సిన వయసు
కంటే ముందే మరణించడం జరుగుతుంది. అప్పుడు చాలా త్వరగా పోయా రంటూ బాధపడటం మామూలే. ఒత్తిడితో ఇలాంటి మృతులు సంభవించడా న్ని అధ్యయనవేత్తలు చాలా దృష్టాంతాలలో పరిశీలించారు. తీవ్రమైన దీర్ఘ కాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగా వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top