దంత సమస్యలు రాకుండా...

ApurupA
0
Teeth Care Tips
రోజూవారి ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు, నోటిలోని ఇతర భాగాలు బయటి వాతావరణానికి నిరంతరం ప్రభావితమవుతుంటాయి. మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు నోటి ఆరోగ్యాన్ని పదికాలాల పాటు కాపాడతాయి. అన్నింటికన్నా ముందు మనం చెప్పుకోవలసింది... తినే ఆహారం గురించే! పంటికి అతుక్కుపోయే అహారపదార్థాలు.. అంటే తీపి పదార్థాలైన చాక్లెట్లు, స్వీట్లు, బేకరీలలో ఎక్కువగా దొరికే ఆహారం ఎంతో ప్రమాదాన్ని తెచ్చి పెడ తాయి. సులభంగా నోట్లో మిగిలిపోకుండా పంటికి, చిగుళ్లకు అతుక్కోకుండా నేరుగా గొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది. ఈ మధ్య అందరూ ఎక్కువగా తీసుకుంటున్న జంక్‌ఫుడ్ పంటిపైన,పంటి సందుల్లోనూ అతుక్కుపోతుంటుంది. సాధారణంగానే నోటిలోఉండే బ్యాక్టీరియా ఈవిధంగా ఇరుక్కున్న ఆహారంతో కలిసిపోయి హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. దాంతోనే అన్నిరకాల దంత సమస్యలూ మొదలవుతాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి.

ఇక రెండవ విషయం... మన ఇంట్లో రోజువారీ శుభ్రత... మనం రోజూ చేసే బ్రషింగ్ గురించి. ఒకపూట పళ్లు తోముకుని నోటి ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడిపోతున్నామని ఫీలైపోతుంటారు. కొంతమంది అతిజాగ్రత్తకు పోయి పళ్లని 15 - 3 0 నిమిషాలపాటు తోమేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. రోజూ నిద్రలేవగానే, ఆ తర్వాత పడుకునే ముందు రెండుసార్లు కేవలం నాలుగు నిమిషాలపాటు తప్పనిసరిగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగని పళ్లని అడ్డదిడ్డంగా తోమేయడం, బలంగా రుద్దడం సరికాదు. ఖరీదైన పేస్టు, చిత్రమైనబ్రష్ల మీద కాకుండా బ్రష్ చేసుకునే విధానంపైన దృష్టిపెడుతూ శాస్ర్తీయపద్ధతిలో వీలైతే అద్దంలో చూసుకుంటూ బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.అయితే అంతటితో సరిపెట్టకూడదు. రెండు పళ్ల మధ్య చేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనబడే నైలాన్ దారంతో శుభ్రపరచుకోవాలి. టూత్పిక్స్, పిన్నులు లాంటివి ఉపయోగించకూడదు. ఇది హానికరమైన అలవాటు. దీంతోపాటుగా మౌత్వాష్ అనబడే నోరు పుక్కిలించే ద్రవాన్ని కనీసం రోజుకొక్కసారి వాడాలి. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియాను అదుపులో ఉంచవచ్చు. ఇవన్నీ చేస్తూనే ప్రతి ఆరునెలలకోసారి ఇంటిల్లిపాదీ డెంటిస్ట్ను కలిసి చెకప్ చేయించుకోవటం, డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించుకోవడం అవసరం. రెగ్యులర్గా చేసుకునే పంటి క్లీనింగ్ (స్కేలింగ్), పాలిషింగ్ లాంటి చికిత్సల వల్ల దంతసమస్యలను అరవై శాతం వరకు నివారించవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top