పళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహర పదార్ధలు :

ApurupA
0
 Foods for Healthy Tooth

పండ్లు, కూరగాయలు 
క్యాల్షియం, ఫాస్ఫరస్‌ ఎక్కువగా ఉండే పెరుగు; పాలు, నట్స్‌, గుడ్లు, మాంసం.. లాంటి న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వీటితో పాటు తాజా పండ్లు, కూరగాయలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.

పాలు 
పాలల్లో అధిక మొత్తంలో క్యాల్షియం ఉండటం వల్ల కేవలం ఎముకలే కాదు.. దంతాలు కూడా దృఢంగా తయారవుతాయి. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం.

ఎక్కువ మొత్తంలో నీరు 
నీరు కూడా దంతాల ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహారాన్ని తొలగించి నోటిలో లాలాజలం స్థాయుల్ని పెంచుతుంది. లాలాజలంలో 95 శాతం నీరు, ఎక్కువ శాతం ప్రొటీన్లు, మినరల్స్‌ ఉంటాయి. ఇవి దంతాల్లో ఏవైనా సమస్యలుంటే తొలగించి దంతాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది.

నిమ్మజాతి పండ్లు 
విటమిన్‌ సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు రక్తనాళాలను బలంగా చేసి చిగుళ్లు, దంతాల దృఢత్వాన్ని పెంచుతాయి. ఈ విటమిన్‌ శరీరానికి చలువ చేస్తుంది కూడా! కాబట్టి ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్‌.. లాంటి నిమ్మజాతి పండ్లను ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

చూయింగ్‌ గమ్స్‌ 
షుగర్‌ ఫ్రీ గమ్స్‌ నమలడం దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిని నమలడం వల్ల పంటికి మంచి ఎక్సర్‌సైజ్‌తో పాటు పళ్ల చుట్టూ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలగించి దంతాల ఎనామిల్‌ను యాసిడ్స్‌ నుంచి కాపాడతాయి.

నువ్వుల నూనెతో.. 
దంతాలపై ఏవైనా మరకలుంటే నువ్వుల నూనెతో పుక్కిలించాలి. దీంతో దంతాలు శుభ్రపడటంతోపాటు కోల్పోయిన ఖనిజాలు తిరిగి అందుతాయి.

చాక్లెట్‌ మిల్క్‌ 
చాక్లెట్‌ మిల్క్‌ వల్ల దీనిలో ఉండే చక్కెర దంతాల్లో ఎక్కువ సమయం ఉండి పళ్లు పుచ్చిపోతాయనుకుంటారు చాలామంది. కానీ దీనివల్ల దంతాల్లో ఏర్పడిన రంధ్రాలు మూసుకుపోయి దంతాలు ఆరోగ్యంగా అవుతాయని చాలామందికి తెలియదు. కాబట్టి ఈ పాలు తాగడం దంతాల ఆరోగ్యానికి మంచిది.

చేపలు 
విటమిన్‌ డి ఎక్కువగా ఉండే సాలమన్‌ చేపలు తినడం వల్ల కూడా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది దంతాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా రక్షణనిస్తుంది.


  • పచ్చి ఉల్లిగడ్డల్ని తింటే అందులో ఉండే యాంటీ మైక్రోబయల్‌ సల్ఫర్‌ వల్ల దంతాల్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. 
  • క్రాన్‌బెర్రీస్‌లో ఉండే పాలీఫినోల్స్‌ దంతాలకు పడిన మరకల్ని పోగొడతాయి. దీనివల్ల ఎలాంటి దంత సమస్యలు రాకుండా ఉంటాయి. 
  • యాపిల్స్‌, క్యారెట్స్‌.. లాంటి గట్టిగా ఉండే పళ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే దంతాలపై ఉండే మరకలు తొలగిపోయి శుభ్రపడతాయి. 
  • గ్రీన్‌ టీ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి దంతాలను రక్షిస్తుంది. 
  • ఫోలికామ్లం నోటిని తాజాగా ఉంచి శరీరంలో కొత్త కణాలు ఏర్పడటంలో తోడ్పడుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top