ఖర్చు పెట్ట కుండనే దొరికే విటమిన్ - డి

ApurupA
0
రాత్రి నిద్ర పోవడం ఆలస్యం. ఉదయం లేవడం ఆలస్యం. లేచాక ఆఫీసుకో, కాలేజికో... టైం అయిపోతుందంటూ ఉరుకులు పరుగులు పెట్టడం. కాస్త అటు ఇటు తేడాగా దాదాపు అందరిదీ ఇదే జీవనశైలి. దీనివల్లే  చాలమందిలో విటమిన్-డి కొరత ఏర్పడుతోంది అంటున్నాయి తాజా అధ్యయనాలు. జనాభాలోని 84 శాతం మందిలో విటమిన్- డి కొరత ఉంది. కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, హృదయకోశ వ్యాధులకు లోపమే కారణం. అందుకే తరచుగా శరీరంలో విటమిన్- డి నిల్వలను పరీక్షించుకోవాలి. రోజూ కొద్దిసేపు శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. లేకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వెలువడే సూర్యకిరణాల్లో విటమిన్-డి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు కాబట్టి ప్రతి రోజూ కొంత విటమిన్-డిని శరీరానికి అందించండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top