గర్భవతులలో రక్తహినత నివారించడం కోసం...

ApurupA
0
రక్తహీనత అన్నది గర్భవతుల్లో చాలా సాధారణం. రక్తహీనత  రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తగ్గడం వల్ల కలుగుతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే తొందరగా అలసిపోవడం, నిస్సత్తువగా ఉండటం, తల తిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్ల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి... ఆమెకు ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం, అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించడం వంటివి చేయాల్సి ఉంటుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచ బారడం అన్నది చాలా సాధారణమైన అంశం కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 16వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్ టాబ్లెట్లను తీసుకుంటుండాలి. వాస్తవానికి వీటిని పరగడుపున తీసుకుంటే రక్తం బాగా పడుతుంది. అయితే చాలామందికి ఇలా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే కాస్త టిఫిన్ తిన్నాక... గంటసేపటి తర్వాత ఐరన్ టాబ్లెట్ తీసుకుని, నిమ్మరసం వంటివి తాగాలి. దీంతో రక్తం బాగా పడుతుంది.
  • నిరసంగా ఉండాడం, కాళ్ళ వాపు ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి, రక్తహీనతకు కారణాన్ని తెలుసుకుంటే, దాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవచ్చు.
ఇక రక్త హీనత నివారణ కోసం... 
  • మాంసాహారం తినే వారైతే మాంసం, కాలేయం, చేపలు...
  •  శాకాహారం తినే వారైతే ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లంతో చేసిన పదార్థాలు తినాలి. దాంతో రక్తం బాగా పడుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top