యాలకులు.... ఉపయోగాలు...

ApurupA
0
యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరస్ శరీరంలో బీపీని అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. అలాగే క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఒకవేళ శరీరంలో క్యాన్సర్ కణలున్న్లయితే వాటిని నాశనం చేస్తుందని కూడా ఓ పరిశోధనలో వెల్లడైంది.
భోజనం చేసిన తర్వాత ఒక యాలక్కాయ తింటే, కేవలం నోటి దుర్వాసన దూరమవడమే కాదు.. అజీర్తి, గ్యాస్, గుండెలో మంట, మలబద్ధకం.. వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

  • ఎ, బి, సి, నియాసిస్, రైబోఫ్లేవిస్ విటమిన్లు, మినరల్స్.. యాలకుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో తోడ్పడతాయి. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడం, మూత్రపిండాల్లో అధికంగా ఉండే యూరియా, క్యాల్షియం.. మొదలైన వాటిని తొలగించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
  • అలాగే యాలక్కాయ గింజల్ని చప్పరించడం ద్వారా మన నోట్లో కొన్ని రకాల ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. ఆకలి తక్కువగా ఉన్నావారిలో ఆకలిని పెంచేందుకు ఈ ద్రవాలు తోడ్పడతాయి.
  • దగ్గు, జలుబు లాంటి సమస్యలకు చెక్ పెట్టలంటే యాలకులు తినాల్సిందే. అలాగే గొంతు ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది.
  • ఒత్తిడిని తగ్గించే పదార్థాల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులు వేసి మరిగించిన టీ తాగడం వల్ల ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
  • శరీరానికి అవసరమయ్యే కొన్ని నూనెలు యాలకుల్లో ఉంటాయి. ఇవి ఎసిడటీ బరి నుంచి మనల్ని కాపాడతాయి. కేవలం ఒక్కరోజు తింటే సరిపోతుందను కుంటరు చాల మంది. కానీ ప్రతి రోజూ భోజనం తర్వాత తింటే చక్కటి ప్రయోజనం ఉంటుంది.
  • యాలకులు తినడం వల్ల ఊపిరితిత్తుల్లోకి రక్తప్రసరణ సరిగ్గా జరిగి ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
  • యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం.. మొదలైనవి అధిక మొత్తంలో ఉంటాయి. వీటివల్ల గుండె కోట్టుకునే వేగం అదుపులో ఉంటుంది.
  • యాలకుల్లో ఉండే విటమిన్లు యాంటఆక్సిడెంట్లగా పనిచేసి శరీరంలోని ఫ్రీరాడికల్సని నాశనం చేస్తాయి.
  • మద్యపానం, ధూమపానం.. లాంటి దురలవాట్లను దూరం చేసుకోవడానికి యాలకులను నమలడం మేలు. దీంతో క్రమంగా ఆ అలవాటుకు స్వస్తి చెప్పొచ్చు.
  •  శరీరంలో మెబలిజం ప్రక్రియను, వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి యాలకులు తోడ్పడతాయి.
  • ఇవి శరీరంలో ఉండే మలినాలను కిడ్నీల ద్వారా తొలగించడంలో సహాయపడతాయి.
  •  క్రీడాకారులు ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి యాలకుల్ని తింటారు. దీనివల్ల క్రమంగా నొప్పులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

కూరలు, బిర్యానీ, కబబ్.. ఇలా వివిధ వంటకాల తయారీలో యాలకులను వాడడం వల్ల రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top