టొమాటో తినడం వల్ల లాభాలు

ApurupA
0
ఎప్పుడూ టొమాటోలేనా? అని విసుక్కోకండి. ఆరోగ్యానికి అవి ఎంతో మేలు చేస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

  • టొమాటోలలోని 'విటమిన్ ఎ' కంటిచూపును మెరుగుపరుస్తుంది. వయసుతోపాటు అంధత్వం ఆవహించకుండా కాపాడుతుంది.
  • క్యాన్సర్‌ను ఎదుర్కొనే గుణం వీటికుంది. టొమాటోలను తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఊపిరితిత్తులు, ఉదరం, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
  • తరచూ టొమాటోలను తినడం వల్ల.. రక్తసరఫరా సాఫీగా సాగేందుకు వీలవుతుంది. ఇందులోని విటమిన్ సి, పొటాషియం, ఐరన్, విటమిన్ కె వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బ్లడ్ క్లాటింగ్, బ్లీడింగ్‌లను నియంత్రిస్తాయి.
  • హృద్రోగ సమస్యల నివారణకు టోమాటోలు పనికొస్తాయి. రక్తనాళాలు మూసుకుపోనీయవు. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొవ్వును పెంచేందుకూ దోహద పడతాయి టొమోటోలు.
  • టొమాటోలను బాగా ఉడికించి సూప్ తాగితే చాలు. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు. ఉదరసంబంధిత ఇబ్బందులు తొలగుతాయి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top