గర్భిణీ స్త్రీలకు సలహాలు

ApurupA
0
గర్భిణీ స్త్రీలకు సలహాలు


  • మీరు ప్రశాంతముగా,సంతోషముగా ఉంటే మీశిశువు కూడా అలాగే ఉంటుంది .
  • ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్ఠిక ఆహారం ఎక్కువ పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలి
  • డాక్టర్ పై విశ్వాసం ఉంచి వారి సలహా పాటించండి,స్వంతంగా మందులు వాడకూడదు.
  • అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది.
  • గర్భము , ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
  • మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు,ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్ష అవసరం.
  • ఎత్తు మడమల చెప్పులు వాడకండి.
  • కుదుపులు కలిగేటట్లు ప్రయాణము చేయకండి.
  • బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి చివరి 3 నెలలలో డాక్తర్ సలహా అడగండి.

మొదటి మూడు నెలలు, చివరి 2 నెలలు,ఈక్రింది పేర్కొన్నవి చేయవద్దు :-

  • దూర ప్రయాణము
  • కారు ,స్కూటర్ నడపడం.
  • అతిగా సంభోగము

ఈ క్రింది పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
  1. రక్తస్రావము
  2. ఉమ్మనీరు పోవడం
  3. శిశువు కదలిక తగ్గినట్టుగాని , ఆగినట్టుగాని అనిపించినపుడు
  4. నొప్పులు రావడం

  • సుఖప్రసవానికి - బ్రీతింగ్ వ్యాయామాలు ,శరీర బరువు పెరగకుండా ఇతర వ్యాయామము డాక్టర్ సలహా ప్రకారము చెయ్యండి.
  • క్రమబద్దమైన విశ్రాంతి అనగా : రాత్రి 8 - 10 గంటలు ,మధ్యాహ్నం 1 గంట అవసరము.
  • నిద్ర పోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు) పడుకోవడం మంచిది.
  • ధనుర్వాతం బారినుండి రక్షణకొరకు టి.టి. ఇంజక్షన్స్ తీసుకోండి.
  • కుటుంబనియంత్రణ సలహా కొరకు ప్రసవమైన 6 వారాల తర్వాత డాక్టర్ ని సంప్రదించండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top