పీసీఓడీ అంటే...

ApurupA
0
పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (అండం) గర్భాశయానికి రెండువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు.
సాధారణ ఋతుచక్రం ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-14 రోజుల మధ్య రెండు అండాశయాలలో ఒక అండాశయం నుండి విడుదల అవుతుంది. ఈ విధంగా ప్రతినెలా ఎడమ లేదా కుడివైపు ఉన్న అండాశయం నుండి ఒక అండం విడుదలవుతుంది. ఫలదీకరణకు సిద్ధంగాఉంటుంది. కాని ఎవరిలో అయితే ఈ పీసీఓడీ ఉంటుందో వారి అండాశయం నుండి అండం విడుదల కాకుండా అపరిపక్వత అండాలు నీటి బుడగల వలె అండాశయపు గోడల మీద ఉండిపోతాయి. ఇది చూడడానికి ముత్యాల వలె అండాశయ గోడల మీద కనిపిస్తాయి. రెండు వైపులా ఉంటే దీనిని బై ఆట్రల్ పీసీఓడీ అంటారు.
దీని బారిన పడిన చాలామంది స్ర్తీలు సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా వెంట్రుకలు రావడం, నెలసరి సరిగ్గా ఉన్నప్పటికీ సంతానలేమితో బాధపడుతూ ఉంటారు.
దీనికి కారణాలు
  • ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల సమతుల్య లోపం వలన ఈ సమస్య వస్తుంది.
  • సరైన జీవనశైలి లేకపోవడం అంటే, ఎక్కువ ఒత్తిడికి లోనవడం,
  • తక్కువ శారీరక వ్యాయామం వల్ల, పిండిపదార్థాలు, కొవ్వుపదార్థాలు అతిగా తినడం మూలంగా ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
  • జన్యుపరమైన కారణాలు కూడా పీసీఓడీకి ఒక ముఖ్యకారణం.
  • హార్మోన్ల చక్రంలో మార్పులు, అధిక ఒత్తిడి, సరియైన వ్యాయామం లేకపోవడం, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం,అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలు తినడం వలన ఇది సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు
  • నెలసరి సరిగా రాకపోవడం
  • నెలసరి సరిగా వచ్చినా కూడా అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, నెలసరిలో 4-5 రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువకాలంకొనసాగడం
  • నెలసరి ఆగి ఆగి రావడం, రెండు ఋతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం  నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పి రావడం
  • నెలసరి రాకపోవడం
  • బరువు పెరగటం
  • ముఖం, వీపు, శరీరంపైన మొటిమలు రావడం. ముఖం, ఛాతీ పైన మగవారిలోలా వెంట్రుకలు రావడం. టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదు పెరగటం వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి
తీసుకోవలసిన జాగ్రత్తలు

  • జీవనవిధానంలో మార్పు చేసుకొని ఒత్తిడిని తగ్గించుకోవడం
  • సరియైన వ్యాయామం చేయడం వలన హార్మోన్ల సమతుల్యతను కాపాడటం
  •  అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలను తగ్గించి, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. 
ఇలా చేయడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top