ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు....

ApurupA
0
టీవీ చూసేటప్పుడు, కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు, దాదాపు అందరూ కూర్చునే ఉంటారు. కానీ ఇలా కూర్చుని ఉండడం వల్ల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం వుంది. కాబట్టి గంటల కొద్దీ అలానే కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు పరిశోధకులు.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ఇబ్బందులు...
  • ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు నడుము చుట్టు వచ్చి చేరుతుంది. ఫలితంగా స్థూలకాయం, రక్తంలో చెక్కర స్ధాయిలు ఎక్కువవడం, రక్తపోటు పెరగడం మొదలైన ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
  • రోజులో ఎక్కువ సమయం కూర్చునే ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
  • ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల డయాబటెస్ సమస్య ఎదురవుతుంది.
  • అధిక సమయాన్ని కూర్చోవడానికే కేటయిస్తే మూత్రపిండాలకు సంబంధించిన రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళల్లో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి వీలైన అన్ని సందర్భాల్లోనూ నిలబడి ఉండడమే మంచిది.
  • బస్సుల్లో, రైళ్ళల్లో సీటులు లేక చాలాసేపు నిల్చునే ప్రయాణిస్తే నడుం నొప్పి వస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది.
‘రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాం కదా!! మేం ఎక్కువ సేపు కూర్చున్నా ఫర్వా లేదు.. మాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు’ అనుకుంటే పొరబడినట్లే. వ్యాయామం చేసినా సరే.. ఎక్కువ సేపు కూర్చోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
అదే పనిగా కూర్చుని ఉండడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు తలత్తుతాయో తెలిసిందిగా. కాబట్టి ఇప్పటి నుంచైనా ఎక్కువ సమయం పాటు అలాగే కూర్చుని ఉండం మానేయండి. వీలైనప్పుడల్లా అటు ఇటు అలా నడుస్తూ ఉండండి.
శరీరానికి వ్యాయామం కల్పించండి. ఆరోగ్యంగా ఉండండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top