బరువు తగ్గాలని మనలో చాల మందికి ఉండే కోరిక. దాని కోసం చాల కష్టపడుతూ ఉంటాం. ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. ఎందుకంటే బరువు తగ్గాలని డైటింగ్, ఎక్సర్ సైజ్ చేస్తున్నా తగ్గకపోవడానికి కారణం మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే. బరువు తగ్గాలనుకునే వాళ్లందరూ సమాన్యంగా చేసే పని తిండి తగ్గించడం. అయితే పూర్తిగా తిండి తగ్గించడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. దాని బదులు మనం ఎన్ని క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాలో అంతే మొత్తం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచి పద్ధతి.
బరువు తగ్గాలాను కొనేవారి కోసం కొన్ని సలహాలు, సూచనలు
డైట్
మనలో చాలమంది. తొందరగా బరువు తగ్గాలని క్రాష్ డైట్ ల మీద ఆధార పడతారు. ఇలాంటప్పుడు తీసుకునే డైట్ శరీర అవసరాలకు అస్సలు సరిపోక పోవచ్చు.. ఉదాహరణకు రోజు మొత్తానికి కలిపి ఏదో ఒక సూప్, పళ్లు మాత్రమే తీసుకునే డైట్ వల్ల మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయా. దీని వల్ల బరువు తొందరగా తగ్గుతాం.. రోజువారీ మనం తీసుకోవాల్సిన క్యాలరీలను తగ్గించడం వల్ల మన శరీరంలోని కొవ్వు కూడా కరుగుతుంది కాదనడం లేదు. కానీ దీని వల్ల మన మెటబలిజం (జీవ క్రియ) పూర్తిగా మారిపోతుంది. శరీర క్రియలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. ఈ డైట్ ప్లాన్ పూర్తయిన తర్వాత మీరు తీసుకునే క్యాలరీలను మీ శరీరం ఎక్కువగా కరిగించలేదు. ఎందుకంటే మీ మెటబలిజం స్లోగా మారింది కాబట్టి. అలా మీరు తిరిగి బరువు పెరుగుతారు.
బ్రేక్ ఫాస్ట్ మానద్దు
ఇది మనలో చాల మంది చేసే అతి పెద్ద తప్పు.
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల దాన్నుంచి వచ్చే క్యాలరీలను మనం తగ్గించుకోగలిగాం అంటూ సంతోషిస్తారు. కానీ నిజానికి దీని వల్ల బ్రేక్ ఫాస్ట్ కంటే ఎక్కువ క్యాలరీలనే మనం తీసేసుకుంటాం. ఎలాగంటరా? ఉదయం మీరు టిఫిస్ చేయకుండా ఆఫీసుకు వెళ్లిపోతారు. కాసేపటికి ఆకలి మీ పనిని డిస్టర్బ్ చేస్తూ ఉంటే, ఏదో ఒక స్నాక్ తినేస్తారు. లేదా హెవీ క్యాలరీ డ్రింక్ తాగుతారు. దీని వల్ల క్యాలరీలు పెరిగినట్టేగా. ఒకవేళ క్యాలరీలు తగ్గించాలని మీరు రూల్ పెట్టుకొని వీన్నింటినీ మానేసినా, లంచ్ ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ మానేయకూడదు. రాత్రంతా గ్యాప్ వచ్చిన క్రమంలో పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల రోజంతా యాక్టవ్ గా ఉండగలుగుతాం. దీని వల్ల క్యాలరీలు ఎక్కువగా కరుగుతాయి. లేకపోతే కడుపు ఖాళీగా ఉండి మన బాడీ మెటబలిజం మందగించే అవకాశాలు ఉంటాయి.
క్యాలరీ చార్ట్ ఫాలో అవ్వండి
సీరియస్ గా అన్ని రూల్స్ పాటిస్తూ డైటింగ్ చేస్తూ ఉండొచ్చు. రోజూ కొన్ని క్యాలరీల ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ సాధారణంగా చేసే తప్పొకటి ఉంది. మనం తినే ప్రతి పదార్థం నుంచి వచ్చే క్యాలరీలను కూడా కౌంట్ చేసుకోవాలి. ఉదాహరణకు ఫ్రెండ్స్ ఏదో శుభవార్త అనో లేక, బర్త్డే అనో అంటూ ఇచ్చిన కేక్ లేదా స్వీట్ని తినేస్తాం. ఏమీ తినం అంటూనే ఫ్రెండ్ తో పాటు క్యాంటన్ కు వెళ్లి, తన ప్లేట్లోంచి రెండు మూడు బజ్జీలో, లేక పిజ్జానో తినేస్తాం. ఇలా లెక్క పెట్టకుండా మనం రోజూ తినే ఆహారం ఎంత ఉంటుందో గమనించండి. అన్నింటినీ రాసుకోండి. ఇలా కనిపించకుండా, లెక్కలోకి రాకుండా తినే పదార్థాల వల్ల కూడా బరువు తగ్గకుండా ఉండే అవకాశాలు ఎక్కువ.
మధ్య మధ్యలో ఎదైన తింటూ ఉండాలి.
మధ్య మధ్యలో ఎదైన తింటూ ఉండాలి.
కేవలం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రమే చేస్తే సరిపోదు. మధ్య మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉండాలి. దీని వల్లే మన జీవక్రియలు యాక్టీవ్ గా కొనసాగుతాయి. అందుకే ప్రతి మూడు గంటలకోసారి ఏదో ఒకటి తినాలనేది. స్నాక్స్ తింటే లావయిపోతున్నామంటూ చాల మంది మధ్యలో ఏం తినకుండా అలాగే ఉంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. హెల్దీ స్నాక్స్ ను తీసుకోవడం వల్ల కూడా మీరు బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.
పాలపదార్థాలూ ఓకే.
చాలమంది పాలు, పాల పదార్థాల నుంచి ఎక్కువ క్యాలరీలు వస్తున్నాయంటూ వాటికి దూరంగా ఉంటూ ఉంటారు. కానీ ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో చాల ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. అందుకే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఉపయోగించాలి. ఐస్ క్రీమ్, స్వీట్స్ వంటివి పూర్తిగా మానేసినా ఫర్వాలేదు.
నీళ్లు ఎక్కువగా తాగాలి.
నీళ్లు బరువు తగ్గడానికి చాల ముఖ్యమైన ఆయుధం. నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పండ్ల రసాలు తాగుతున్నాం, అందులో నీళ్ళుంటాయి కదా అని నీటిని తీసుకోవడం తగ్గించ కూడదు. ఎంత ఎక్కువగా నీటిని తీసుకుంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీళ్ల బదులుగా ఆల్కహాలు, కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు తాగడం కూడా సరికాదు. నీటిని తీసుకోవడం వల్ల అదనంగా ఒక్క క్యాలరీ కూడా చేరదు. కానీ మిగిలిన వాటి వల్ల ఎక్కువ క్యాలరీలు లభిస్తాయి. అలాగే ఫ్యాన్సీ కాఫీలు, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేస్తే మంచిది. వీటి నుంచి కనీసం 500 క్యాలరీలు ఈజీగా అందుతాయి. అందుకే ఇలాంటి వాటన్నింటికీ దూరంగా ఉండాలి.
లో-ఫ్యాట్- పదార్ధలైన వద్దు.
బరువు తగ్గాలనుకునే వాళ్లంతా లోఫ్యాట్ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.. మీరు కూడా అలాగే చేస్తున్నారా? సాధారణంగా తక్కువ క్యాలరీలు లభించే ఆహారం తీసుకుంటే మంచిది అనుకుంటాం... కానీ ఇక్కడే చిన్న తేడా ఉంది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి.. లోఫ్యాట్ పదార్థాలన్నింటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయని చెప్పలేం. వాటిలో ఉన్న కార్బోహైడ్రేట్స్, ప్రొటన్స్ నుంచి మనకు క్యాలరీలు అందుతాయి. ఇవి ఎక్కువగానే ఉండొచ్చు. లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలని మనం ప్రారంభించినా ఎలాగో లోక్యాలరీలే కదా. అంటూ మనం సాధారణంగా తినే మొత్తం కంటే ఎక్కువగా తినేసే అవకాశం ఉంది.
బయటి తిండి వద్దు
చాలమంది ఆఫీసు నుంచి అలసిపోయి వస్తున్నాం. మధ్యలో ఏదో ఒకటి తిందాం అంటూ ఆగుతారు. ముందు హెల్దీ ఫుడ్ తిందామనుకున్నా, అక్కడకు వెళ్లిన తర్వాత మనసు వూరుకుంటూందా? బజ్జీలో, పకోడీలో, పిజ్జానో, బర్గర్ నో నోరూరించే తిరుతుంది. ఈరోజు ఒక్కరోజే, అనుకుంటూ లాగించేస్తాం. వారానికి రెండు సార్లు ఇలా బయట తినే వాళ్లు తినని వాళ్లతో పోలిస్తే నెమ్మదిగా బరువు తగ్గుతారు. అందుకే ఈ అలవాటు మానేస్తే మంచిది.. ఒకవేళ మానలేం అనుకుంటే నూనె కలవని ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం మంచిది.
బరువు చెక్ చేసుకోవలసిన అవసరం లేదు.
చాలమంది డైట్ ప్లాన్ ప్రారంభించిన రోజు నుంచి ప్రతి రోజూ బరువు చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక రోజులో పెద్దగా మారిపోయేదేమీ ఉండదని మనం గమనించాలి. కనీసం పదిహేను రోజులకోసారి బరువు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బరువు చెక్ చేసుకొని, తర్వాత 15 రోజుల్లో ఎంత మేరకు బరువు తగ్గాలనుకుంలున్నారో సెట్ చేసుకుంటే దానికి అనుగుణంగా వర్కవుట్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఒకేసారి కాకుండా ముందుగా చిన్న లక్ష్యం పెట్టు కోవడం మంచిది
ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పెట్టుకునే గోల్ మీరు చేరుకునే విధంగా ఉండాలి. వారం రోజుల్లో రెండు, మూడు కేజీలు తగ్గాలనుకుంటే అది అత్యాశ అవుతుంది. అందుకే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని చేరుకోగలుగుతున్నామా? లేదా? అన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ చేరుకోగలుగుతుంటే దాన్ని కొనసాగించొచ్చు. లేకపోతే ఎక్కడ లోపం ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది.
వ్యాయామం తప్పదు
డైటింగ్ చేస్తూ వ్యాయామం చేయడం వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్సర్ సైజ్ చేయకపోతే మీ బరువు తగ్గించే పని పూర్తిగా డైట్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. యోగా, వ్యాయామం వల్ల రెండు లాభాలుంటాయి. దీని వల్ల మీ బరువు తగ్గడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అందుకే వాకింగ్, స్విమ్మింగ్, మొదలైన వాటితో పాటు డ్యాన్స్, యోగా వంటివీ ప్రయత్నించవచ్చు.
ఈ విధంగా తీసుకునే ప్రతి క్యాలరీని లెక్క పెటుకుంటూ, మనం ఖర్చుచేసే క్యాలరీల మీద కూడా దృష్టి సారిస్తే ఇంకా మనం ఎన్ని క్యాలరీలు కరిగించాల్సి ఉంటుందో మనేక తెలుస్తుంది. దాన్ని బట్టి ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా తక్కువ క్యాలరీలు తీసుకుంటూ, మిగిలిన వాటిని వ్యాయామం ద్వారా కరిగించు కోవడం వల్ల త్వరగా బరువు తగ్గగలుగుతాం.

This comment has been removed by the author.
ReplyDelete