పాలు' అనేవి పిల్లలకేగానీ పెద్ద వాళ్లకు అక్కర్లేదని చాలామంది నమ్ముతున్నారు. కానీ వాస్తవానికి...
పాలన్నది సంపూర్ణ ఆహారం. చంటి పిల్లలకు అదొక్కటే ఆహారం, కొంచెం పెద్దయితే పాలతో పాటు అదనపు ఆహారం కూడా ఇస్తారు. పాల ద్వారా మన శరీరానికి వచ్చే పోషకాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లలకు సమృద్ధంగా పాలు ఇవ్వాలి.
ఇక పెద్దల విషయానికి వస్తే- పాలలో ఉండే కొవ్వు ఒక్కటి తప్పించి మిగతావన్నీ మనకు చాలా అవసరమైనవి. పాలలో క్యాల్షియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లకు క్యాల్షియం చాలా ఎక్కువ అవసరం. లేకపోతే ఒక వయసు వచ్చేసరికి ఎముకలు బోలుబోలుగా తయారై ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి పెద్దలు కొవ్వు తీసిన, లేదా కొవ్వు తక్కువున్న పాలు తీసుకోవటం మంచిది. ఎముకల బలంగా ఉండడానికి స్త్రీలకు పాలు మరీ ముఖ్యం.