శరిరం తిమ్మిరెక్కడం

ApurupA
0
శరీరంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. కాళ్లు, చేతులు, పాదాలు వంటి భాగాలలో రక్తప్రసారంలో కొంత అంతరాయం కలిగి, తిరిగి మళ్లీ ప్రసరించడానికి జరిగే ఒక రకమైన శరీర ప్రక్రియే ‘తిమ్మిరి’ శరీరభాగాలలో
తిమ్మిరెక్కిన ప్రదేశంలో సూదులతో పొడిచినట్లు, స్పర్శజ్ఞానం కోల్పోయినట్లు, మొద్దుబారినట్లు వుంటుంది. కాళ్లు ముడుచుకుని (బాసింపట్టు వేసుకుని) ఎక్కువ సేపు కూర్చుని పైకి లేస్తే కాళ్లు, పాదాలలో తిమ్మిరి ఎక్కుతుంది. 
పొడవుగా లాగి వుంచిన నీటిగొట్టంలో నీరు ప్రవహించి నట్లు రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంటుంది. అలాంటప్పుడు నిలువుగా వున్న నీటిగొట్టాన్ని మడిస్తే ఏమవుతుంది? నీళ్లుధారాళంగా ప్రవహించకుండా ప్రవాహనికి అడ్డుకట్టపడి, కొద్ది కొద్దిగా ప్రవహిస్తాయి. అలాగే రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు వివిధ అవయవాలలో గల విషతుల్యమైన వ్యర్థ పదార్థాలను కూడా రక్తం తీసుకుని వెళుతుంటుంది. ఈ పనికి అడ్డుకట్టపడినప్పుడు వ్యర్థ విషపదార్థాలు పేరుకుని పోయి, ఆయా అవయవాలనుండి మెదడుకు సందేశాలు చేరవేసే నాడీకణాలను మూసివేస్తాయి. కింద కూర్చుని లేచినప్పుడు ప్రవహించడం ఆగిపోయిన రక్తం తిరిగి ప్రవహించే ప్రక్రియలో ఆయా అవయవాలు మొద్దుబారినట్లు, సూదులతో పొడిచినట్లు, తిమ్మిరి ఎక్కుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top