ఉల్లి.. మేలు...

ApurupA
0
ఇప్పుడు ఎవరిని కదిపినా, కొలస్ట్రాల్ సమస్యలూ, కీళ్ల నొప్పులే! వీటిని అదుపులో ఉంచుకోవాలంటే ఉల్లిపాయలని ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు.

ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు కళ్లు మండటనికి కారణం... వాటిల్లోని సల్ఫర్ ఖనిజమే. ఇది రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. గుండె నొప్పికి కారణం అయ్యే కొలస్ట్రాల్ సమస్యని అదుపులో ఉంచి ట్రైగ్లిజరాయిడ్లు పెరగకుండా చేస్తుంది. ఉల్లిపాయల్లో ఉండే ఫ్లవనాయిడ్లు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటయి.

మెనోపాజ్ కు ముందు ఎముకలు సాంద్రతని కోల్పోయి గుల్లబరిపోతుంటాయి. ఆ సమయంలో ఉల్లిపాయలని తగిన మోతాదులో తీసుకుంటే ఆ సమస్య నుంచి బయపడొచ్చు. ఉల్లిలోని కొన్ని రకాల పోషకాలు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందించి, వివిధ రకాల వ్యాధులు దాడిచేయకుండా అడ్డుకుంటాయి. రోజు మొత్తం మీద ఓ మోస్తరు పరిమాణంలోని ఒక్క ఉల్లిని చేర్చుకున్నా సరే, అండాశయ క్యాన్సర్ ని అదుపు చేయడానికి అది పనికొస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్యాక్టీరియా సంబంధిత ఇస్ఫెక్షన్లని నివారించి, రక్తంలోని చెక్కర స్దాయిలను సమంగా ఉండెట్లు చేసి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికీ ఉల్లిపాయలు ఎంతో ఉపయోగపడతాయి. నూనెలో ఎక్కువగా వేయించినప్పుడు కన్నా, ఆవిరి మీద ఉడికించినవి ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు కలిగిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top