గుడ్డు తీనడం వల్ల లాభాలు

ApurupA
0

 చౌకధరలో అందుబాటులో ఉండే పోషకాహారం కోడిగుడ్డు. ఇది శరీరానికి మేలు చేసే  హెచడీఎల్ కొలస్ట్రాల్ ను పెంచుతుంది.  దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులూ దరిచేరవని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల దీనిలో ఉండే పోషకాలు రక్తం గడ్డ కట్టడాన్ని అదుపులో ఉంచుతాయి. గుడ్డులో లభించే కెరొటినాయిడ్లు ల్యూటిస్, జెక్సాంతిస్ అనే పోషకాలను కలిగి ఉంటయి. ఇవి కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాములు అంటే ఎక్కువగా ప్రొటస్ లభిస్తుంది. తొమ్మిది రకాల శరీర అవయాల పనితీరుకి అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. ఒక కోడిగుడ్డు సొనలో మూడొందల మైక్రోగ్రాముల కొలైస్ లభిస్తుంది. ఈ పోషకం మెదడు పనితీరుకీ, నరాల వ్యవస్థ బలంగా ఉండటనికీ దోహదం చేస్తుంది. అంతేకాదు విటమిస్ డి సహజంగా అందే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు ఒకటి. ఆహరంలో కనీసం ఆరు కోడిగుడ్లు తినే మహిళల్లో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం 44 శాతం తక్కువగా ఉంటుదని  కోన్ని సర్వేలలో తెలింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top