షుగర్‌ వ్యాధి రాకుండా ఆపడానికి ఏం చేయాలి

చాలామంది కొలెస్ట్రాల్‌, అధిక కొవ్వు వల్లనే గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయని అనుకుంటుంటారు. కానీ ఇటీవలి కొత్త అధ్యయనాల వల్ల హై బ్లడ్‌ షుగర్‌ కూడా గుండె జబ్బులకు కారణమవుతుందని తెలుస్తోంది. షుగర్‌ ఉన్నా లేకపోయినా హై బ్లడ్‌ షుగర్‌ వల్ల గుండెకు ఇబ్బందులు కలగడం మాత్రం తప్పవు. మీకు ప్రస్తుతానికి డయాబెటిస్ లేకపోయినా బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. 

డయాబెటిస్‌ ఉన్నవారిలో బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవెల్స్‌ ఒక శాతం పెరిగితే హార్ట్‌అటాక్‌ వచ్చే అవకాశాలు 18 శాతం పెరుగుతాయని తెలిసింది. అయితే క్రమబద్ధమైన మంచి జీవనశైలితో బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌లో తేడా తీసుకు రావచ్చు. ఆహారంలో తక్కువ షుగర్‌, నూనె, కొవ్వు, ఎక్కువ పీచు పదార్థాలు ఉండేట్లు చూసుకుంటే 30 శాతం వరకు బ్లడ్‌ షుగర్‌ను తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, వారానికి కనీసం ఐదు రోజులు వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌లతో పాటు వారంలో కనీసం రెండు సార్లు గుండె పని తీరు సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాల వల్ల 30 శాతం బ్లడ్‌ షుగర్‌ తగ్గుతుంది. ఇక పై వ్యాయామాలకు తోడు మెడిటేషన్‌ చేస్తే ఆ తీవ్రతలోని మరో 30 శాతం మాయమవుతుంది. ఇవన్నీ పాటించగలిగితే బ్లడ్‌ షుగర్‌లో 10 శాతం బోనస్‌ రిలీఫ్‌ కలుగుతుంది. మీరు ఈ రకమైన జీవనశైలిని పాటిస్తూ భవిష్యత్తులో రాబోయే డయాబెటిస్‌ను వీలైనంతగా ఆలస్యం చేయవచ్చు.        

Related

health articles 1638531832999704148

Post a Comment

emo-but-icon

Hot in week

Recent

4/comments/show

Comments

Side Ads

Text Widget

Connect Us

item