27 ఏళ్ల మగవాని తెలివితేటలు 18 ఏళ్ల మహిళ తెలివితేటలకు సమానం... ?

ApurupA
0
ఆడవాళ్లకు మెదళ్ల పరిమాత్రమే చిన్నదనీ, అయితే, సామర్థ్యంలో మాత్రం ఎవరికీ తీసిపోవని వివిధ దేశాలలో మెదడు పనితీరుపై జరుగుతున్న పరిశోధనల ద్వారా తెలుస్తోంది. మహిళల్లో మెదడు సైజు చాలా చిన్నగా ఉన్నప్పటికీ, పురుషుల మెదడు కంటే వేగంగా, చైతన్యవంతంగా పనిచేయగల సామర్థ్యం దానికి ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. పురుషుల మెదళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు మెదళ్లు చాలా చిన్నవే అయినా అవి పాదరసంలా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా మహిళలకు పురుషుల కంటే మెదడు ఎనిమిది శాతం తక్కువగా ఉంటుంది. అయితే, తమ చుట్టూ చోటు చేసుకుంటున్న మార్పుల్ని పసి కట్టడంలోనూ, విచక్షణ చేయడంలోనూ అది పురుషుల కంటే అనేక రెట్లు ఎక్కువ చైతన్యవంతంగా పని చేస్తుందని  చెబుతున్నారు.

తమ మెదళ్లు చిన్నవైనా ఆడవాళ్లు వాటిని మగవారి కంటే చాలా సమర్థవంతంగా, చురుకుగా, వేగంగా ఉపయోగిస్తుంటారు. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా పని చేయడానికి, వేగంగా పని చేయడానికి కారణం వారి మెదళ్ల తీరు తెన్నులు మగవాళ్ల కంటే భిన్నంగా ఉండడమే. పైగా మగవాళ్లు మెదడు ఉపయోగించడానికి ఖర్చయ్యే శక్తి కంటే, ఆడవాళ్లు మెదళ్లు ఉపయోగించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. మెదడులోని అతి తక్కువ కణాలతో ఆడవాళ్లు చేసే పనిని మగవాళ్లు అతి ఎక్కువ కణాలతో చేయాల్సి వస్తుంది. కీలక సమయాల్లో మగవాళ్ల మెదళ్లు కంటే ఆడవాళ్ల మెదళ్లే వేగంగా పని చేస్తాయని, మెదడులోని కణాల తీరుతెన్నులు అందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు వివరించారు.

తార్కికంగా, హేతుబద్ధంగా ఆలోచించడానికి తోడ్పడే న్యూరాన్ కణాలు పురుషుల మెదళ్లలో వేల సంఖ్యలో కట్టలు కట్టలుగా ఉంటాయి. అయితే వాటి మధ్య కనెక్షన్లు ఉండవు. కానీ, ఆడవాళ్లలో ఈ న్యూరాన్ కణాల మధ్య కనెక్షన్లు ఉంటాయి. అందువల్ల మగవాళ్ల కంటే చురుకుగా ఆలోచించడానికి, పని చేయడానికి ఆడవాళ్లకు అవకాశం కలుగుతోంది. ప్రపంచ దేశాలలో వేలాది మంది మహిళలు, పురుషుల మెదళ్లపై ప్రత్యేక పరిశోధనలు చేసిన ఈ సైంటిస్టులు ఆడవాళ్ల మెదళ్లు పురుషుల మెదళ్ల కంటే ఎనిమిది శాతం చిన్నవే అయినా, దాదాపు పదహారు శాతం చురుకైనవని, చైతన్యవంతమైనవని నిర్ధారించారు. ఈ ఇద్దరి మధ్యా ఒకే విషయం మీద పరీక్ష పెడితే పురుషుడి కంటే వేగంగా మహిళ నుంచి సమాధానం లభించడం గమనించామని వారు వివరించారు.
మెదడులో జ్ఞాపకశక్తికి, భావోద్వేగాలకు సంబంధించిన హిప్పోక్యాంపస్ అనే కణాల విషయంలో కూడా ఆడవాళ్లకు, మగవాళ్లకు మధ్య చాలా తేడా కనిపిస్తోంది. న్యూరాన్ కణాల లాగానే ఈ కణాలు కూడా పురుషుల్లోనే ఎక్కువ. కానీ, ఎక్కువ సంఖ్యలో ఉన్న హిప్పోక్యాంపస్ కణాల కంటే తక్కువ సంఖ్యలో ఉన్న హిప్పోక్యాంపస్ కణాలే అతి సమర్థవంతంగా పని చేస్తున్నాయని తేలింది. మరో విచిత్రమేమిటంటే, మగవాళ్లలో న్యూరాన్లు, హిప్పోక్యాంపస్‌లు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అంత మంచిది. ఆడవాళ్లలో అవి ఎంత తక్కువ సంఖ్యలో ఉంటే అంత మంచిది. మగవాళ్ల కంటే ఆడవాళ్లలో జ్ఞాపకశక్తి అధికంగా ఉండడానికే కాక, భావోద్వేగాలు ఎక్కువగా ఉండడానికి కూడా ఈ హిప్పోక్యాంపస్ కణాలు బాగా ఉపయోగపడుతున్నాయి.
27 ఏళ్ల మగవాడి తెలివితేటలు 18 ఏళ్ల మహిళ తెలివితేటలకు సమానంగా ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలివితేటల్లో ఆ నిష్పత్తితోనే జీవితాంతం తేడాలు చోటు చేసుకుంటూ వస్తాయని కూడా వారు చెప్పారు. ఓ వాదనలో ఎక్కడ లోపం ఉంది, ఎలా వాదించాలి అన్నది ఆడవాళ్లకు తెలిసినంతగా మగవాళ్లకు తెలియదని, విషయ పరిజ్ఞానంతో తప్ప లౌక్యంగా వాదించడం మగవాళ్లకు తెలియదని కూడా శాస్త్రవేత్తలు వివరించారు. పైగా మగవాళ్లు నాలుగు మాటల్లో వివరించే విషయాన్ని మహిళలు ఒక్క మాటలో చెప్పగలరని కూడా వారు తెలిపారు.  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top