మన ఇంట్లో కూర్చునే అధిక బరువును తగ్గించుకోవడానికి మార్గాలు
- రోజూ కనీసం 30 నిమిషాలైన వాకింగ్ చేయడం ఎంతో మంచిది, దీని వల్ల మీరు ఆ రోజు తీసుకున్న క్యాలరీలు తగ్గుతాయి.
- మీ రోజువారి ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉన్న ఆహరం అంటే పాలు, మజ్జిగ ఎల ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.
- ఒకవేళ మీకు మంసాహారం అంటే ఇష్టం ఉన్ననూ, ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు, దాని వల్ల మీశరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువ.
- ద్రవం రూపంలో ఉన్నవి ఎక్కువగా తీసుకోవాలి, ప్రత్యేకంగా “గ్రీన్ టీ” రోజుకు కనీసం 2 సార్లు అయినా తీసుకుంటే ఎంతో మంచిది, ఇది మీ శరీరంలోని కొవ్వు పదార్దాలను కరిగిస్తుంది.
- మీరు తీసుకునే ఆహారంలో “చక్కెర నిల్వలు” ఎక్కువగా ఉంటే దానిని తగ్గించడం ఎంత అవసరం, ఎందుకంటే ఈ చక్కెర నిల్వలు అధిక బరువుకి దారి తీస్తాయి.
- అధిక రసం కలిగిన పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది, ప్రత్యేకంగా నారింజ, పుచ్చకాయ, పైన్ ఆపిల్ తీసుకుంటే మీ బరువుని ఎంతో సులభంగా తగ్గించుకోవచ్చు.
- మీ ఆహారం తీసుకునే పద్దతిని మార్చుకోండి, ఒకవేళ మీరు రోజుకి 3 సార్లు ఆహరం తీసుకుంటున్నట్లైతే దానికి నాలుగు సార్లుగా కొంచెం కొంచెం తీసుకోండి.
- మీ ఆహారంలో చీజ్, నెయ్యి మరియు వెన్న ఎలాంటి కొవ్వుని కలిగించే పదార్దాలు లేకుండా చూసుకోండి ఎందుకంటే వీటి వల్ల మీ బరువు పెరిగే అవకాశం ఎక్కువ.
- మీ అధిక బరువు తగ్గించుకోవడానికి వారంలో కనీసం 3 కోడి గుడ్లు అయినా తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఈ కోడి గుడ్లలో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.
- సాద్యమైనంత వరకూ ఆకలి వేస్తేనే ఆహారం తీసుకోండి, అంతేకాకుండ ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి లేని సమయంలో కూడా ఆహారం తీసుకోవడం వల్ల మీరు అధిక బరువుకు గురి అయ్యే ప్రమాదం ఉంది.
- రోజూ వ్యాయామం చేయండి,అలా చేస్తే మీ శరీరంలోని క్యాలరీలు తగ్గి మీ బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి,వీలుంటే “యోగా” చేయడం ఎంతో శ్రేయస్కరం.
- ప్రతి రోజు ఓకే సమయంలో నిద్రపోతే మీలోని జీవక్రియ రేటు పెరిగి, మీ అదిక బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది.
- మీ రోజు వారి ఆహారంలో “సూప్స్” తీసుకుంటే అది మీ అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
- నూనెతో చేసిన వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది,ఎందుకంటే వీటిలో అధిక శాతంలో ఉన్న క్యాలరీలు,మీ బరువు అధికంగా పెంచే అవకాశం ఉంది.
- బంగాళ దుంపలలో కేలరీలు మరియు కార్బోహైడ్రేట్ల ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువుకు గురి చేసే ప్రమాదం ఉంది.
బరువు తగ్గించే ద్రవాలు(డ్రింక్స్):
- రోజూ కాఫీ తాగడం వల్ల అందుకో ఉండే కెఫిన్ మీ బరువుని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఇందులో కోకో మరియు కోలా గింజలు కలుపుకుంటే మంచి ప్రబావం చూపిస్తాయి.
- ఆపిల్ జ్యూస్, తేనె, చల్లని నీరు కలిపి తీసుకుంటే మీకు మీ శరీరంలోని క్యాలరీలను తగ్గించడమే కాకుండా మీ జీర్ణ సమస్యలకి మంచి ఫలితం లబిస్తుంది.
- నిమ్మ,నారింజ వంటి సిట్రస్ పండ్లు జ్యూస్ రోజూ తీసుకుంటే మీ అధిక బరువు సమస్యను తరిమేయవచ్చు.