ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్ధలు...

ApurupA
0
పరుగుల జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోకుండా పనిచేయడం కష్టం. అయితే నిరంతరం ఎంత బిజీగా ఉన్నా.. మానసిక ఒత్తిళ్లను అధిగమించకపోతే.. ప్రశాంతత కరువవుతుంది. తద్వారా ఎన్నో జబ్బుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి చక్కటి వ్యాయామం, నిద్ర మాత్రమే కాదు. ప్రత్యేకించి ఆహారం విషయంలోనూ జాగ్రత్త పడాలి. 
తాజాపండ్లు, కూరగాయలు, ఆకుకూరలు శరీరంలోని చక్కెరస్థాయిలను తగ్గిపోనీయవు. ఒకవేళ తగ్గిపోతే మానసిక ఒత్తిళ్లు అధికమై, శారీరక ఉద్వేగాలు పెరుగుతాయి.
  • శరీరంలోని విషతుల్యాలను శుభ్రం చేస్తుంది కెరోటిన్. ఇది బొప్పాయిలో దొరుకుతుంది. వారంలో కనీసం రెండుమూడు సార్లు అయినా బొప్పాయిని తినడం శ్రేయస్కరం.
  • చక్కటి నిద్రకు, మెదడు చురుకుదనానికి లాక్టోజ్ అవసరం. ఇది పాలలో అధికం. రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఒత్తిళ్లకు దూరం కావొచ్చు. తద్వార నరాల బలహీనత రాదు.
  • చిలగడదుంపల్లో అత్యధిక పీచుతో పాటు కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. మానసిక ఒత్తిళ్లను తగ్గించే గుణం దీని సొంతం.
  • జీర్ణవ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది అరటిపండు. ఇందులోని మెగ్నీషియం రక్తపోటులో హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. రోగనిరోధకశక్తి పెరుగుదలకు తోడ్పడుతుంది.
  • ఆల్మండ్స్‌లోని మెగ్నీషియం, జింక్, విటమిన్ బీ2, విటమిన్ ఇ, సిలు మానసిక ప్రశాంతతకు ఉపకరిస్తాయి. ఇందులో కొవ్వు అధికం. అయినా హానికరం కాదు.

ఇవన్నీ తింటూనే క్రమం తప్పక వ్యాయామం చేయాలి. వేళకు భోంచేసి, నిద్రపోవాలి. తరచూ మంచి నీళ్లు తాగాలి. ఉద్యోగస్తులైతే రెండు గంటలకు ఒకసారి తేలికపాటి వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top