జ్వరం ఉన్న వారు తీసుకోదగిన ఆహారం

ApurupA
0
జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి డాక్టర్ వద్దకు వచ్చినప్పుడు ఏఏ పదార్థాలు తీసుకోవచ్చునని అడగడం సర్వ సాధారణం. రోగిని పాలు, బ్రెడ్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించడమూ మనకు తెలిసిన విషయమే. జ్వరం వచ్చినప్పుడు రోగి శరీరంలో రసాయన, భౌతిక ప్రక్రియలు అధికమవుతాయి.. మూత్రంలో మాంసకృత్తులకు సంబంధించిన నైట్రోజెన్ వృధా అవుతుంది. రోగి ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటాడు. ఫలితంగా రోగి బరువు తగ్గుతాడు. జ్వరం దీర్ఘకాలికంగా బాధిస్తే రోగి చిక్కిశల్యమవుతాడు. జ్వరం వచ్చినప్పుడు రోగి శరీరంనుంచి అనుకోని విధంగా మాంసకృత్తులు వృధా కాకుండా, సరైన ఆహారం ఎలా తీసుకోవాలో సూచించాల్సిన బాధ్యత డాక్టర్దే.
సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు అన్నం తింటే మంచిది కాదని, మనలో కొన్ని నమ్మకాలున్నాయి. ఇవి నిరాధారమైనవి. మాంసకృత్తులు (మాంసం, కోడిగుడ్లు మొదలైనవి) తింటే జ్వరం ఎక్కువవుతుందని భావిస్తారు. ఇదీ కూడ నిజం కాదు. జ్వరం ఉన్నప్పుడు రోగికి ఏ ఆహారం తీసుకోవాలని ఉంటుందో దానినే ఇవ్వడం మంచిది. జ్వరం ఉన్నప్పుడు పాలు, బిస్కట్లు, కార్న్ప్లేక్స్ తీసుకోవచ్చు. మెత్తగా ఉడికించిన అన్నం, రసం, ఆలు గడ్డ కూర, పెరుగు, మజ్జిగ మొదలైనవి తీసుకోవచ్చు. గోధుమ రవ్వ, సగ్గుబియ్యం పాయసం ఇవ్వవచ్చు. బాగా ఉండికించిన మాంసం, చేపలు, పండ్లు, పండ్ల రసాలు, పంచదార, ఇడ్లీలు, ఆవిరి కుడుములు, తక్కువ నూనెతో చేసిన ఉప్మా, బొంబాయి రవ్వ హల్వా మొదలైనవి ఇవ్వవచ్చు. కాఫీ, టీ మొదలైనవి తాగవచ్చు. బ్రెడ్, బటర్, జామ్, తేనె, పాలు, పంచదారలో నానబెట్టిన అటుకులు మొదలైనవి ఇవ్వవచ్చు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top