కళ్లకింద నల్లమచ్చలు పోవాలంటే...

ApurupA
0
శరీరంలో అన్ని భాగాలలోకి కంటి కింద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.  అందుకే త్వరగా నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిద్రలేమి, ఒత్తిడి, అధిక బరువు, పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఇతర జబ్బుల కారణంగా కళ్లకింద నల్లమచ్చలు వస్తాయి.
వంశపారంపర్యంగా ఆస్తమా ఉండేవాళ్లకు కూడా ఇవి త్వరగా ఏర్పడతాయి. కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదనే సూచన కూడా ఉంది. దాన్ని పట్టించుకోవాలి. నీళ్లు తక్కువగా తీసుకోవడం వల్ల కంటి కింద నల్లటి మచ్చలు రావచ్చు. అందువల్ల రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోండి.
ఎండలో తిరగడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. సూర్యరశ్మి ప్రభావం కంటిమీద చాలా ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి.
నిద్రలేమి వల్ల కూడా త్వరగా ఈ సమస్య బారినపడతారు. అలసిన కళ్లపై ఒక 15నిమిషాలు చల్లటి టీ బ్యాగ్లు ఉంచండి.
  • సాయంత్రం పడుకునే సమయంలో కళ్లకింద కీరాదోసకాయ ముక్కలు పదినిమిషాలు ఉంచండి.
  • విటమిన్ సి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • కంటికింద మాస్క్లు వేసుకున్నా ఫలితం ఉంటుంది.
  • రెండు, మూడు తమలపాకులు నూరి దీనికి రోజ్వాటర్, పసుపు కలిపి ముఖానికి రాసుకుని ఆరాక కడిగేయాలి. చర్మంపై నల్లమచ్చలు మాయమమతాయి.
  • ప్రతిరోజూ పడుకునే ముందు కళ్లచుట్టూ విటమిన్-ఇ ఆయిల్ అప్లయి చేయాలి.
  • రోజ్వాటర్లో కాటన్ ముంచి కళ్లచుట్టూ శుభ్రం చేసి పడుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కళ్లు తాజాగా అవుతాయి.
  • పడుకునే ముందు కనురెప్పలకి ఆముదం అప్లయి చేయాలి. క్రమం తప్పకుండా పదిరోజులు ఇలా చేస్తే అవి ఒత్తుగా పెరుగుతాయి.
  • చెక్కుతీసిన బంగాళాదుంప ముక్కను పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్లమీద అప్లయి చేసి రిలాక్స్ అయ్యాక చన్నీటితో కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • కొన్ని చుక్కల తేనెతో కళ్లచుట్టూ ఉన్న చర్మాన్ని, సున్నితంగా వలయాకారంలో మర్దనా చేయాలి. క్రమం తప్పకుండా ఈవిధంగా చేయడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న నల్లవలయాలు తగ్గుతాయి.
  • పచ్చిపాలలో రెండు కాటన్బాల్స్ ముంచి కళ్లమీద ఉంచితే త్వరగా రిలాక్స్ అవ్వొచ్చు.
  • శరీరంలో అన్ని భాగాలలోకి కంటి కింద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.  అందుకే త్వరగా నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిద్రలేమి, ఒత్తిడి, అధిక బరువు, పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఇతర జబ్బుల కారణంగా కళ్లకింద నల్లమచ్చలు వస్తాయి.
  • వంశపారంపర్యంగా ఆస్తమా ఉండేవాళ్లకు కూడా ఇవి త్వరగా ఏర్పడతాయి. కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదనే సూచన కూడా ఉంది. దాన్ని పట్టించుకోవాలి. నీళ్లు తక్కువగా తీసుకోవడం వల్ల కంటి కింద నల్లటి మచ్చలు రావచ్చు. అందువల్ల రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోండి.
ఎండలో తిరగడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. సూర్యరశ్మి ప్రభావం కంటిమీద చాలా ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి.
నిద్రలేమి వల్ల కూడా త్వరగా ఈ సమస్య బారినపడతారు. 
 సాయంత్రం పడుకునే సమయంలో కళ్లకింద కీరాదోసకాయ ముక్కలు పదినిమిషాలు ఉంచండి. 
  • విటమిన్ సి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • కంటికింద మాస్క్లు వేసుకున్నా ఫలితం ఉంటుంది.
  • రెండు, మూడు తమలపాకులు నూరి దీనికి రోజ్వాటర్, పసుపు కలిపి ముఖానికి రాసుకుని ఆరాక కడిగేయాలి. చర్మంపై నల్లమచ్చలు మాయమమతాయి.
  • ప్రతిరోజూ పడుకునే ముందు కళ్లచుట్టూ విటమిన్-ఇ ఆయిల్ అప్లయి చేయాలి.
  • రోజ్వాటర్లో కాటన్ ముంచి కళ్లచుట్టూ శుభ్రం చేసి పడుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కళ్లు తాజాగా అవుతాయి.
  • పడుకునే ముందు కనురెప్పలకి ఆముదం అప్లయి చేయాలి. క్రమం తప్పకుండా పదిరోజులు ఇలా చేస్తే అవి ఒత్తుగా పెరుగుతాయి.
  • చెక్కుతీసిన బంగాళాదుంప ముక్కను పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్లమీద అప్లయి చేసి రిలాక్స్ అయ్యాక చన్నీటితో కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • కొన్ని చుక్కల తేనెతో కళ్లచుట్టూ ఉన్న చర్మాన్ని, సున్నితంగా వలయాకారంలో మర్దనా చేయాలి. క్రమం తప్పకుండా ఈవిధంగా చేయడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న నల్లవలయాలు తగ్గుతాయి.
  • పచ్చిపాలలో రెండు కాటన్బాల్స్ ముంచి కళ్లమీద ఉంచితే త్వరగా రిలాక్స్ అవ్వొచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top