తల్లి కావాలని కోరుకోని మహిళలూ ఉండదు. పెళ్లైన ప్రతి మహిళా పీరియడ్స్ మిస్
అవ్వగానే తాను తల్లి కాబోతున్నానని ఆనందపడుతుంది. కానీ ఒక్కోసారి అది ప్రెగ్నెన్సీ
కాకపోవచ్చు. అసలు గర్భం ధరించామా లేదా అన్న విషయాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు? ఒకవేళ గర్భం ధరించినట్లు కన్ఫర్మ్ అయితే తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నీ అనుమానాలే.. అందుకే ఇక అనుమానాలు అన్నీ క్లియర్ చేసుకొండి.
ఈ విషయాలు గమనించండి
- ఉదయం లేవగానే తల తిరగడం, వాంతి అయేటట్లు అనిపిస్తోందా? ఇవి గర్భధారణకు సంకేతాలు. దీన్నే ‘మార్నింగ్ సిక్నెస్’ అంటరు.
- నెలనెల సక్రమంగా వచ్చే పిరియడ్ ఒక్కసారి మిస్సయితే మీరు గర్భం ధరించారని అనుకోవచ్చు. కానీ దీన్ని మూత్రపరీక్ష ద్వారా నిర్ధారించుకోవాలి.
- కొంతమందిలో స్తనాల పరిమాణం కూడా పెరిగే అవకాశాలున్నాయి.
- మరికొంతమంది గర్భం ధరించిన కొన్ని రోజుల వరకు చిరాకు, ఉద్రేకంతో ఉంటారు.
- కొంత మందికి ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు నచ్చకపోవచ్చు. హార్మోన్లలో మార్పుల వల్ల ఇది జరుగుతుంది.
- ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు.
- త్వరగా అలుపు రావడం కూడా గర్భధారణకు ఓ సంకేతమే..
ఈ సంకేతాలు మీలో కనిపించిన వెంటనే మూత్రపరీక్ష చేసుకోని గర్భధారణ ను కన్ ఫార్మ్ చేసుకోవాలి. ఈ కీట్ లు మెడికల్
షాపుల్లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఫలితం పాజిటీవ్ గా వస్తే వెంటనే డాక్టర్ను
సంప్రదించాలి.
- గర్భం దాల్చిన తర్వాత కొద్ది నెలలు చాల జాగ్రత్తగా వ్యవహరించాలి. డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ, వారి సూచనలు పాటించడం మంచిది.
- ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మీ బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి ఈ ఆహారం ఎంతో ముఖ్యం.
- మీ కండరాలకు బలన్ని చేకూర్చడానికి ఎక్సర్సైజులు చేయండి. డాక్టర్ అనుమతిలో చేసే ఈ వ్యాయామాల వల్ల బిడ్డ ఎదుగుదల చక్కగా ఉండడమే కాదు. ప్రసవ సమయంలో మీ కండరాలు త్వరగా వ్యాకోచించడానికి ఉపయోగపడుతుంది.
- ప్రస్తుతం మీకున్న ఆరోగ్య సమస్యలు, ఇంతకు ముందు మీకు వచ్చిన ధీర్ఘకాలిక వ్యాధులు, మీకు జరిగిన సర్జరీల గురించి తప్పనిసరిగా మీ డాక్టరుకు తెలియజేయండి. వాటివల్ల మీ ప్రెగ్నెన్సీలో ఏమైన ఇబ్బందులు వచ్చే అవకాశముంటే ముందునుంచే జాగ్రత్తలు తీసుకోమని చెబుతారు.
‘గర్భం దాల్చినప్పుడు ఏ పనీ చేయకూడదు. ఇవి తినాలి, అవి తినకూడదు.’ అంటూ ప్రతి ఒక్కరూ మనల్ని
కంగారు పెట్టేస్తుంటరు. అసలు ప్రెగ్నెన్సీలో చేయకూడని పనులేంటో తెలుసుకుందాం...
- మీరు గర్భం దాల్చరని మీకు తెలిసిన నిమిషం నుంచే మీరు టీ, కాఫీ లాంటీ కెఫెన్ పదార్ధలు తక్కువగా తీసుకొండి. వీలైతే పూర్తిగా మానేయడం చేయాలి.
- జంక్ ఫుడ్ వీలైనంత దూరంగా ఉండండి. ఎప్పుడైనా జంక్ఫుడ్ తినాలనిపిస్తే వాటికి బదులు పండ్లు, మొలెకత్తిన గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి ఉపయోగపడే పోషకాలు అందుతాయి.
- ప్రెగ్నెన్సీలో మరొక అతి ముఖ్యమైన విషయం ఏవి పడితే ఆ మందులను వాడకూడదు. తలనొప్పి, కాళ్లనొప్పులంటూ సొంతంగా కొనుక్కున్న మందులు అసలే వాడకూడదు. మీరేదైనా మందులు వాడాలనుకుంటే కేవలం డాక్టర్ సూచనతో మాత్రమే వాడండి.
- ఏ విషయం గురించైనా సరే ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి లోనవ్వకండి. తల్లికి ఎలాంటి ఒత్తిడీ లేకపోతేనే బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఎక్కువ.
- మీ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోండి. బాగా వేడినీటితో స్నానం చేయడం, ఎక్కువ సేపు ఆవిరిపట్టడం వంటివి చేయకపోవడం మంచిది. ఎండలో తిరిగి రాగానే మజ్జిగలంటివి తాగడం మంచిది.
- పళ్లు, ఆకుకూరలు, కాయగూరలతో పాటు మొలకెత్తిన విత్తనాలు, చేపలు వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
- రోజుకు పదిగ్లాసుల మంచినీరు తీసుకోవడం మర్చిపోవద్దు. కూల్ డ్రింక్ తాగాలనిపించినప్పుడు వాటి బదులు అప్పుడే తయారుచేసిన పండ్లరసం తాగొచ్చు.
ఈ సూచనలు తప్పక పాటిస్తే గర్భధారణ సమయంలో మీ ఆరోగ్యంతో పాటు పుట్టబోయే మీ
బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది.