గుండె నొప్పి అని తెలిస్తే ఏం చేయాలి?

ApurupA
0
బీపీ, షుగర్, పని ఒత్తిళ్ల వల్ల హృద్రోగాలు వస్తున్నాయి. గుండె కండరాలు దెబ్బతినడం, రక్తనాళాల్లో ఆటంకం ఏర్పడటం వల్ల గుండె నొప్పి వస్తుంటుంది. కారణాలేమైనా ఆకస్మాత్తుగా గుండె నొప్పితో సృహ కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇంట్లో ఉన్నప్పుడు, రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు, కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు కొందరు గుండెనొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు గుండెనొప్పి వచ్చిన రోగులు, వారి పక్కన ఉన్న వారు ఏం చేయాలనే విషయాలను వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

ఆకస్మాత్తుగా తీవ్రమైన గుండె నొప్పి వచ్చి ఎవరైనా సృహ కోల్పోయినప్పుడు పక్కన ఉన్న వారు వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, వెంటనే అంబులెన్స్‌ను పిలిచి, జాప్యం లేకుండా సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తే చాలా కేసుల్లో రోగి ప్రాణాలు కాపాడవచ్చు. కార్యాలయంలోనో, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనే ఉన్నప్పుడు గుండె నొప్పితో పడిపోతే సమీపంలో ఉన్న వారు చేయాల్సిన ప్రాథమిక చికిత్సలపై అందరికీ అవగాహన అవసరం. వివిధ రకాల హృద్రోగాల వల్ల ఓ వ్యక్తి గుండె ఆగి మెదడుతోపాటు ఇతర శరీర భాగాలకు రక్త సరఫరా నిలచినప్పుడు సృహ కోల్పోతాడు. అలాంటప్పుడు పక్కనున్న వారు కార్డియాక్ రెసిస్టేషన్ కోసం ప్రాథమిక చికిత్స చేయటం వారి కర్తవ్యంగా భావించాలి.
ఛాతీ వద్ద రెండు చేతులు ఒకదానిపై ఒకటి పెట్టి అదుము తుండాలి. అలా నిమిషానికి 60 నుంచి 70 సార్లు చేయాలి. నోటి నుంచి నోటి ద్వారా సృహ కోల్పోయిన రోగికి శ్వాస కల్పించాలి. రోగి మెడ వెనుక చేయి పెట్టి డీఫిబ్రిలేటర్ మిషన్ సాయంతో షాక్ ఇవ్వాలి. దీనివల్ల ఆగిపోయిన గుండె బ్రెయిన్‌ డెడ్ కాకముందే స్టిములేట్ అయి పనిచేయటం ఆరంభిస్తుంది. దీంతోపాటు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, సత్వరం రోగిని ఆసుపత్రికి చేర్చాలి.


ఆకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చినపుడు మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటే దీర్ఘంగా శ్వాస పీల్చి వదులుతుండాలి. తన రెండు చేతులతో గుండెను అదుముతూ కంప్రెషన్ చేసుకుంటే మంచిది. దీంతోపాటు వెంటనే ఫోన్ చేసి, అంబులెన్స్‌ను తెప్పించుకొని, వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవాలి. గుండెనొప్పి వచ్చినపుడు ఇంటి వద్ద, బహిరంగ ప్రదేశాల్లో తీసుకునే బేసిక్ లైఫ్ సపోర్టు రోగి ప్రాణాలు కాపాడేందుకు దోహదం చేస్తుంది. గుండెనొప్పి వచ్చినపుడు చేయాల్సిన ప్రాథమిక చికిత్సపై అందరిలో చైతన్యం రావాలి. 

గుండెనొప్పి వచ్చిన రోగికి ఆసుపత్రికి తీసుకొచ్చాక తక్షణ వైద్య చికిత్స చేయించాలి. నోరు లేదా ముక్కులో నుంచి ట్యూబ్ పంపించి వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తారు. తొడ లేదా మెడలోని చిన్న రక్తనాళం ద్వారా గుండె లోపలకు పేస్‌మేకర్ ద్వారా విద్యుత్తు ఇచ్చి గుండెలో రక్తం పంపింగ్‌ను పెంచుతారు. బెలూన్ పంపు, ఇంప్లెల్లా డివైజ్‌ల ద్వారా గుండె ఎడమ వైపు నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరాను పెంచుతారు. ఈ చికిత్స వల్ల ఆక్సిజన్‌తోపాటు రక్త సరఫరా మెరుగుపడి హృద్రోగి కోలుకుంటాడు.

గుండె నొప్పికి కారణాలెన్నో...

ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావటానికి పలు కారణాలున్నాయి. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా ఆగిపోవటం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గి గుండె నొప్పి వస్తుంది. దీన్ని పల్మమనరీ అంబాల్కిమ్ అంటారు. కొందరికి పుట్టుకతోనూ హృద్రోగాలు వస్తుంటాయి.

ముందస్తు పరీక్షలు

సాధారణంగా గుండెకు సంబంధించి సమస్యలు వచ్చాయని అనుమానమున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి కార్డియాలజిస్ట్‌ల పర్యవేక్షణలో ఈసీజీ, 2డి ఇకో, టీఎంటీ, హోల్టర్ మానిటరింగ్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, కొరోనరీ యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేయించుకోవాలి. హృద్రోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండటంతోపాటు గుండెనొప్పి వచ్చినప్పుడు ప్రాథమిక చికిత్సతోపాటు వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ప్రాథమిక చికిత్స, సత్వర వైద్యంతో రోగి ప్రాణాలు కాపాడవచ్చని అందరూ గ్రహించాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top