40 పై బడిన వారు తీసుకోవలసిన ఆహరం.....

ApurupA
0
నలబై సంవత్సరాలు వారు రాత్రిళ్లు మితంగా తినాలనే ఉద్దేశంతో అల్పహారం తీసుకుంటుటారు. 
ఇలా చేయడం మంచిదేనా?
సరైన ఆహారం తీసుకోకపోతే సరికొత్త ఆరోగ్య సమస్యలేైనా వస్తాయేమోనని భయంగానూ ఉంటుంది.
తక్కువ తినడం వల్ల ఏమైన అనర్థాలున్నాయా? 
అల్పహారమే తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి. 
ఇలాంటి ప్రశ్నలు చాలమంది అడుగుతుంటారు. వీటి అన్నింటికీ సమాధానం....
వయసు పెరిగిన తర్వాత మధుమేహం, అధిక కొలస్టాల్, గుండె సంబంధత వ్యాధులు, మోకాళ్ల నొప్పులు రాకుండా ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాత్రి పూట తీసుకునే అల్పహారంలో పుల్కలు, ఉడికించిన పప్పుధాన్యాలు (పెసలు, రాజ్మా, శనగలు లాంటివి), గోధుమ అన్నం, రాగి జావ, పండ్లు, పచ్చి కూరగాయలు ఉండేల చూసుకుంటే మంచిది. అప్పుడే మనం ఆరోగ్యం ఉండగలుగుతాం. అంతేకానీ ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ, వడ, పొంగలి వంటివి తీసుకుంటూ ఉంటారు చాలమంది. వాటితో పాలు చట్నీలు కూడా తీసుకుంటారు, ఇది మనం రోజూ తినే అన్నం కంటే ఎక్కువ క్యాలరీలు అందేల చేస్తాయి. అందుకే ఇలాంటి ఆహారాన్ని మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. పైగా వయసు పైబడిన కొద్దీ శరీరానికి విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి అందే ఆహారం తీసుకోవాలి. 

ప్రత్యేకించి రాత్రిళ్లు ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోవడం మానేయకూడదు. అలాగే ఆహారాన్ని మార్చాలనుకునేముందు ఆరోగ్యం, కుటుంబ చరిత్ర, అధిక బరువు వంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో సంబంధిత నిపుణులను వ్యక్తిగతంగా సంప్రదించి వాళ్ల సలహాలను తీసుకోవడం శ్రేయస్కరం!

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top