ప్రతిరోజు పళ్ళు, కూరగాయలు తీసుకోవడం వలన లాభాలు

ApurupA
0
రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు ఎక్కువ మోతాదులో ఉండాలని తరచూ వింటు ఉంటాం.. అయితే రోజూ కూరగాయలు పండ్లను తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏఏ కూరగాయలు, పండ్లను ఎంతమేరకు తీసుకోవాలంటే... 

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా ఉండేల చూసుకోవాల్సిందే.. మనం తినే ఆహారంలో ఎక్కువ మోతాదులో విటమిన్లు, మినరల్స్ ఇతర పోషకాలను అందించేవి ఇవే. ఫలనా కూరగాయలే తినాలని రూలేం లేదు. ప్రతి కూరగాయ, పండు, ఆకుకూర తినాల్సిందే.. ప్రతి దానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. రోజూ ఒక వ్యక్తి 600 గ్రాముల వరకు (పండ్లు, కూరగాయలు కలిపి) తీసుకోవడం వల్ల క్యాన్సర్, ఆస్టియోపోరోసి, గుండెజబ్బులు, ఉబకాయం, అధిక రక్తపోటు రాకుండా కాపాడుకోవచ్చు. అయితే వీటిని ఎంచుకునేప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడూ ఓకే రకం పండ్లు, కూరగాయలు కాకుండా అన్ని రకాలనూ ఎంచుకోవడం మంచిది. వాటిని ఎంత తాజాగా వాడితే అంత మంచిది. రోజూ ఏదో ఒక రకం ఆకుకూరను కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. దుంపకూరలను మితంగా వినియోగిస్తే మంచిది. క్యారెట్, బీట్రూట్, మా, క్యాబేజీ.. ఇలా ఏదైనా సరే.. రోజూ ఏదో ఒక కూరగాయను పచ్చిగా తినడానికి ప్రయత్నించండి. అలాగే రోజూ ఏదో ఒక పండును కూడా తప్పనిసరిగా తీసుకోవాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top