ఒక్కసారి మధుమేహం వచ్చిన తర్వాత ఎటువంటి ఆహారం
తీసుకుంటున్నాం? ఎప్పుడు తింటున్నాం? ఎంత తినాలి? వంటి విషయాలన్నో పరిగణనలోకి
తీసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయి అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని అదుపులో
ఉంచుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి.
- మధుమేహంతో బాధపడే వాళ్లు యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే డయాబెటిక్ ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
- వాటి ద్వారా విటమిన్లు, మినరల్స్ కూడా ఎక్కువగా అందాల్సి ఉంటుంది.
- ఒకవేళ ఉదయం ఆలస్యంగా నిద్ర లేచినా, ఖాళీ కడుపుతో అలాగే ఉండకుండా ప్రొటన్లు ఎక్కువగా లభించే కోడిగుడ్డులోని తెల్లసొన భాగాన్ని ఉడికించి తీసుకోవచ్చు.
- స్కిమ్డ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్న బోజనాన్ని సాధ్యమైనంత వరకు పన్నెండు గంటల కల్ల పూర్తి చేసేయండి.
- మీ ఆహారంలో ఎక్కువగా తాజా ఆకుకూరలు, పసుపు, కాషాయం రంగు పండ్లు ఉండేల చూసుకోండి. వీటిని తీసుకునే ముందు ఓ సారి నిపుణుల సూచనలు తీసుకుంటే మంచిది.
- కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు, పెరుగు మాత్రమే తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వండి.
- ఒక సారి పోషకాహార నిపుణులను సంప్రదిస్తే ఏ సమయంలో ఏది తినాలనే ఆహార ప్రణళిక (డైట్చార్ట్) సిద్ధం చేస్తారు.