మునుపటి రోజుల్లో జనాలకు సైకిల్ నడిపే అలవాటు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సైకిల్ తొక్కే అలవాటు చాలావరకు తగ్గిపోయింది. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్య రీత్యా చాలా లాభాలు వున్నాయనే విషయం మనం తెలుసుకోవాలి. అవి ఏటంటే...
- సైకిలు తొక్కడం వల్ల కండరాలు దృఢంగా, శక్తిమంతంగా తయారవుతాయి.
- కాళ్లు, భుజాలు, చేతులు, వెన్ను, పొట్ట కండరాలలోకి రక్తప్రసరణ మెరుగు అయి ఆ భాగాల కండరాలు పటిష్టం అవుతాయి.
- శ్వాసక్రియ మెరుగుపడుతుంది.
- రెగ్యులర్గా సైకిల్ తొక్కే అలవాటు చేసుకుంటే శరీరంలో వున్న కొవ్వు వినియోగమై ఒబేసిటీ (స్థూలకాయం) ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.
- సైకిలు ఒక క్రమపద్ధతిలో తొక్కుతున్నప్పుడు శ్వాసకోశాలలోకి నిరంతరంగా గాలిని పీల్చుకోవలసివస్తుంది. దీనివల్ల ఆక్సిజన్తో కూడిన రక్తం ధమనుల ద్వారా కండరాలకు ప్రసరిస్తుంది.
- కండరాలు ఆక్సిజన్ ను ఎక్కువగా గ్రహిస్తే కణజాలం నుండి వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా శరీరం కొత్త శక్తిని పొందుతుంది.