హార్మోన్ల అసమతౌల్యం వల్ల వచ్చే పీసీఓడీ తగ్గిచుకోండి ఇలా...

ApurupA
0
పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (సరిగా ఎదగని అండం) గర్భాశయానికి రెండు వైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. దీని బారిన పడిన చాలామంది స్త్రీలు సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా వెంట్రుకలు రావడం, నెలసరి సరిగ్గా ఉన్నప్పటికీ సంతాన లేమితో బాధపడుతూ ఉంటారు. దీనిని అదుపులో ఉంచుకోవడానికి ఈ సలహాలు పాటించి చూడండి...

హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఎదురయ్యే పీసీఓడీతో బాధపడేవారికి సాధారణంగా, ఆకలి, జీవక్రియలకు సంబంధించిన సమస్యలు, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం మొదలు పెట్టడం వల్ల అది తలనొప్పి, నీరసం, కళ్లు తిరగడానికి దారి తీసింది. అయితే మీరు తగినంత బరువు ఉన్నారా ? లేదా? అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ బరువు తగ్గిన విషయం తెలుసుకోవడానికి మీ నడుం భాగం, భుజాలు కొలుచు కొని చూడండి. ఇక కళ్లు తిరగడం, తలనొప్పి వంటి వాటిని దూరం చేసుకోవాలంటే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పాలిష్ చేసిన బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, బొంబాయి రవ్వకు బదులు గోధుమ నూక వాడడం, ఇలాంటి మార్పులను మీ ఆహారంలో చేసుకోండి. ముడి ఆహారానికి, తృణధాన్యాలకు ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇవ్వండి. అన్ని వేళల మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకో ఉపయోగమేంటంటే దీని వల్ల ఆకలి కూడా అదుపులో ఉంటుంది. సాధ్యమైనంత వరకు శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా సోయా ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోండి. అప్పుడప్పుడు ఉడికించిన కోడిగుడ్డులోని తెల్లసొన, చేపలు తీసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఆహారంలో మార్పులు చేసుకున్నా, పెద్దగా మార్పు లేకపోతే, ఒకసారి డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top