డ్రైఫ్రూట్స్ లడ్డూ

ApurupA
0
కావలసినవి :

ఖర్జూరాలు,
ఎండుకొబ్బరి,
పుచ్చకాయ గింజలు,
కర్బూజా గింజలు,
పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు... మొత్తం కలిపి అరకేజీ ఉండాలి.  (నచ్చిన ఏ గింజలనైనా వాడుకోవచ్చు) ,
బెల్లం - అరకేజీ,
పటికబె ల్లం - మూడు టేబుల్ స్పూన్లు,
ఏలకుల పొడి - అర టీ స్పూను;
నెయ్యి - టేబుల్ స్పూను.

తయారి:
  •  డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు)
  • ఖర్జూరాలను కూడా సన్నగా కట్ చేయాలి.
  • మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి.
  • ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటిక బెల్లం వేసి వేయించి బాగా కలిశాక పక్కన ఉంచుకోవాలి.
  • బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడ బోస్తే, తుక్కు బయటకు పోతుంది. ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ నెయ్యి జతచేయాలి. ఉండ పాకం వచ్చే వరకు ఉంచాలి;
  • పటిక బెల్లం జత చేయాలి; 
  • ఈ మిశ్రమాన్ని డ్రైఫ్రూట్స్ మీద పోసి బాగా కలిపి మరో మారు స్టౌ మీద ఉంచి కాసేపు ఉడికించాలి;
  • కిందకు దించి ఉండలు చేసుకుంటే డ్రైఫ్రూట్ లడ్డూ రెడీ...
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top