రేపటి ఆరోగ్యం కోసం... ఇప్పటి నుంచే...

ApurupA
0


పచ్చి కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, వండిన తర్వాత వాటి లోని విటమిన్లు తగ్గిపోతాయని చాల మంది భావిస్తుంటారు. కానీ ఇది అన్నిసార్లూ నిజం కాదు. నీటిలో, ఆవిరి వ్యాయామం చేసే మేలు అంతా ఇంతా కాదు. ఒత్తిడి, ఉబకాయం, గుండెజబ్బులు, మధుమేహం వంటి సమస్యల బరిన పడకుండా చూడడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. పరుగు, జాగింగ్ వంటి వ్యాయామాలు, ఆహార నియమాలు మధ్యవయసు వారికి, వృద్ధులకే అవసరమని అనుకుంటుంటారు. కానీ నిజానికివి అన్ని వయసుల వారికీ అవసరమే. అయితే చాలమంది ముఖ్యంగా యువతీ, యువకులు వీటిని పెద్దగా పట్టించుకోరు. ఈ వయసులో ఆహార నియమాలేంటి? రోజూ వ్యాయామం చేయాలా? అని పశ్నిస్తుంటారు. నిజానికి చిన్నవయసు నుంచే వీటిని అలవరచుకుంటే మున్ముందు జబ్బుల బరిన పడకుండా కాపాడుకోవచ్చు. శరీర సామర్థ్యమూ పెరుగుతుంది. అందువల్ల 18-30 ఏళ్ల వయసు వారు ఆహారం, వ్యాయామం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

ఆహారం: ఈ వయసులో శరీరం, రోగనిరోధకశక్తి చాల బలంగా ఉంటాయి. ఎలాంటి ఆహారం తీసుకున్నా బాగా జీర్ణమవుతుంది. అయితే తక్కువ తక్కువగా (250-300 కేలరీలు) మూడు నుంచి ఐదుసార్లు ఆహారం తీసుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన. రాత్రుళ్లు బాగా పొద్దుపోయాక తినడం, జంక్ ఫుడ్, కాఫీలు, కోలాలు వంటివి మానేస్తే మేలు. మద్యం, సోడాలు కూడా పరిమితంగానే తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలతో అవసరమైన విటమిన్లు లభించేలా చూసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే మాంసం, చేపలు తినాలి. వీటితో ఐరన్, ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్ తో కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి.
వ్యాయామం: ఈ వయసులో పరుగెత్తడం చాల బాగా ఉపయోగపడుతుంది. ఇది బలంగా ఉండేందుకే కాదు, చురుకుదనాన్నీ పెంపొందిస్తుంది. శరీర దారుఢ్యాన్ని (బాడీ బిల్డింగ్) పెంచుకోవాలని అనుకునేవారు బరువులత్తే వ్యాయామాలూ చేయవచ్చు. వేగంగా నడవడం, సైకిల్ తొక్కడం, ట్రకింగ్, ఈత వంటివీ కుడా మంచివే. క్రికెట్, హాకీ, టెన్నీస్ వంటి ఆటలూ ఆడొచ్చు. శరీరం అటు ఇటు తేలికగా కదలటానికి, నియంత్రణ, సమన్వయం కోసం యోగా కూడా బాగా ఉపయోగపడుతుంది.
ఎలా ఉపయోగపడుతుంది?
పరుగెత్తడం, వేగంగా నడవడం, ఏరోబిక్స్ వంటివి గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరానికి అధిక మొత్తంలో ఆక్సిజన్ అందుతుంది. శరీరంలోని అన్ని బాగాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. కేలరీలు ఖర్చవుతాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. బరువులు ఎత్తడం, జిమ్లో వ్యాయామాలు కండరాలు దృఢంగా ఉండేల చేస్తాయి. కదలికలను మెరుగు పరుస్తాయి. పలుచని కండరాల మోతాదును పెంచుతాయి. అంతేకాదు వ్యాయామం మూలంగా ఏకాగ్రత కూడా పెరుగుతుంది.  
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top