దిగులుగా అనిపిస్తోందా? అయితే లేచి నిలబడండి.
కాసేపు అటు ఇటు నడచి చూడండి. ఎందుకంటే రోజుకి ఏడు గంటలు, అంతకన్నా ఎక్కువ సేపు
కూచునే స్త్రీలలో డిప్రెషన్ లక్షణాలు మరింత అధికంగా కనిపిస్తున్నట్లు తాజా అధ్యయనంలో
బయటపడింది. ఎక్కువ సేపు కూచోవడం వల్ల పరిసర
వాతావారణంతో సంబంధం తగ్గిపోతుందని, ఇది డిప్రెషన్ కు దారి
తిస్తుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. మన మెదడులో ఎండార్ఫిన్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి మనం ఉత్సాహంగా
ఉండటానికి తోడ్పడతాయి. ఎక్కువ సేపు కూచోవడం వల్ల ఈ ఎండార్ఫిన్ లో చురుకుదనం తగ్గి పోతుంది.
అంతే కాదు.. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే బాగాలకు రక్త సరఫరా కూడా తగ్గుతుంది.
ఇవన్నీ నిరుత్సాహ భావన కలగటనికి దారితీసే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి
అదేపనిగా కూచోకుండా వీలైనప్పుడల్ల కాస్త లేచి నిలబడి, అటు ఇటు నడవడం మంచిదని
నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువ సేపు కూచుంటే విచారం!
September 02, 2014
0
Share to other apps