అరటి పండ్లు కడుపులో ఆమ్లాల్ని తగ్గించే ప్రకృతి సిద్ధ యాంటిసిడ్లగా పని చేస్తాయి. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహార
పదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటునట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు.
అరటి వంటి పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు గుండె జబ్బుల్ని నివారించమే కాకుండా ఎముకల
ఆరోగ్యాన్నీ కాపాడతాయి. వీటిలో ఉండే యాంటీసిడ్ ప్రభావం కడుపులో పుండ్లనూ తగ్గిస్తుంది.
- అరటిపండుతో పోలిస్తే.. అరటికాయలో చెక్కర, ఉప్పు తక్కువగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యానికి మంచిది.
- ఎ విటమిన్, పొటాషియం, పీచు వంటి పోషకాలను అరటికాయల నుంచి పొందవచ్చు.
- అరటిపువ్వుల్లో పీచుతో పాటు మాంసకృత్తులు అస్శాచురేటడ్ ఫ్యాట్ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ ఇ తోపాటు ఫ్లవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
- అరటిపువ్వును తరచూ తీసుకోగలిగితే, కొన్ని రకాల అనారోగ్యాలు.. ముఖ్యంగా మలబద్ధకం, ఉబ్బసం, అల్సర్ వంటి వాటిని నివారించవచ్చు