ఆత్మీయులను కోల్పోవడం, విడాకులు తీసుకోవడం, ఉద్యోగం నుంచి తోలగింప బడడం వంటి ఒత్తిడికి దారి తీసే ఘటనలను ఎదుర్కొన్నప్పుడు ఎవరైనా తీవ్ర ఆందోళన, నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోవం సహజమే. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవి...
- ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, మాదక ద్రావ్యల జోలికి వెళ్లకూడదు. ఈ వ్యసనాలు ఒత్తిడిని తగ్గించకపోగా పరిస్థితిని మరింత దిగజారుస్తాయి.
- ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా, మిత్రులు, ఆత్మీయులతో గడపడానికి ప్రయత్నించాలి. దీంతో కొంత సేపైనా బాధను మరచి పోవడానికి సాధ్యమవుతుంది.
- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, వీలైనంత ఎక్కువగా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం చాల అవసరం.
- మానసిక ప్రశాంతతకు దోహదం చేసే మర్దన వంటి చికిత్సలు తీసుకోవచ్చు
- వీలైనంత వరకు రోజువారీ పనులను చేయడంపై దృష్టి పెట్టాలి. ఇతరులకు సాయం చేయడం, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి పనుల్లోనూ నిమగ్నమయ్యేల చేసుకుంటే అవి ఆత్మ విశ్వాసాన్ని, తృప్తిని కలిగించి, ఒత్తిడి నుంచి త్వరగా కోలుకొని తిరిగి మామూలు మనిషిగా అయ్యేందుకు దోహదం చేస్తాయి.
- స్నేహితుల, కుటుంబ సభ్యుల, వైద్యులు లేదా కౌన్సెలర్ల సలహా తీసుకొని వారి సహాయం పొందడం మంచిది. ఇది మానసిక ధైర్యాన్ని చేకూరుస్తుంది. నమ్మకం గల వారు మత గురువుల సలహా తీసుకోవడము కూడా మంచిదే.