మధుమేహం ఉన్న వారికి కృత్రిమ తీపి పదార్థాలు (ఆర్టిఫీషియల్ స్వీటనర్స్) మంచివని భావిస్తూ చాలామంది వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇదంత మంచిది కాదు.
ఆస్పర్టేమ్, శాక్రీన్ వంటి కృత్రిమ తీపి పదార్థాలను ఏదో పాలు, కాఫీల్లో రుచికి కొద్దిగా కలుపు కొంటే పెద్దగా నష్టం ఉండదు గానీ వాటితోనే స్వీట్లు, బిస్కట్లు, బేకరీ ఉత్పత్తుల వంటివన్నీ చేసుకుని.. వాటిని పెద్ద మొత్తంలో తినటం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రస్తుతానికి చెప్పటం కష్టం. అవేవీ సహజమైనవి కావు, కృత్రిమ రసాయనాలు. వాటిపై జరిగిన అధ్యయనాలు ఇంకా స్పష్టంగా ఏమీ తేల్చకపోయినా సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవటమే మంచిదని గుర్తించాలి.