చర్మం కింద ఉన్న ఫాలికిల్ అనే చిన్న చిన్న పాకెట్ల నుంచి జుట్టు తయారవుతుంది. ఒక్కో ఫాలికిల్ నుంచి దాదాపు మూడేళ్ల పాటు వెంట్రుక పెరుగుతుంది. ఆ తరువాత రాలిపోయి ఆ స్ధానంలో కొత్త వెంట్రుక మోలుస్తుంది.
ఈ ఫాలికిల్ అనేది మగవాళ్లలో ఉత్పతి అయ్యే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పై అధారపడి ఉంటుంది.
ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిలో హెచ్చు తగ్గుల వల్ల ఆ ప్రభావం పైన చెప్పిన ఫాలికిల్ మీద పడుతుంది. దానివల్ల ఫాలికిల్స్ ముడుచుకుపోతాయి. దాంతో కొత్తగా వచ్చే ప్రతీ వెంట్రుకా అంతకు ముందు వచ్చిన దానికంటే చిన్నదిగా వస్తుంది. దీనివల్ల వెంట్రుక చర్మాన్ని దాటుకుని బయటికి రాలేదు.