ఆహారపు రంగులూ... వాటి మేలు...

ApurupA
0
ఆహారాన్ని, అందులోని పోషకాలను పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అంటూ వేర్వేరు ప్రాతిపదికలపై విభజించవచ్చు  అయితే రంగుల ప్రాతిపదికన మనం తినే పదార్థాలన్నింటినీ విడదీసి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిస్తే... ఈ విధంగా ఉంటాయి.

ఆకుపచ్చటి పళ్లు/కూరగాయల్లో... 
అవొకాడో, గ్రీన్ ఆపిల్, గ్రీన్ గ్రేప్స్, కివీ ఫ్రూట్ వంటి పండ్లు; బ్రకోలీ, గ్రీన్ క్యాబేజీ, ఆకుపచ్చగా ఉండే అన్ని ఆకుకూరలు, ఆకుపచ్చగా ఉండే బెండ, దోస, బీన్స్తో చాలా ఉపయోగాలున్నాయి. ఇలా ఆకు పచ్చగా ఉండే తినదగ్గ పండ్లు, కూరల్లో ప్రధానంగా క్లోరోఫిల్, పీచు, ట్యూటిన్, జియాగ్జాంథిన్, రెస్వరట్రాల్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఎలాజిక్ యాసిడ్, క్వెర్సిటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే తినే పదార్థాల విషయంలో అవి కంటిచూపు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయుని గుర్తుంచుకోవాలి. రెటీనా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఆకుపచ్చటి పదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు క్యాన్సర్ను బలంగా అడ్డుకుంటాయి. రోగనిరోధక శక్తిని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

తెల్లరంగు పదార్థాలు...
తినే భాగం తెల్లగా ఉండే పండ్లలో అరటి, కూరకు ఉపయోగించే కాలీఫ్లవర్, వెల్లుల్లి, ఉల్లి, వైట్ కార్న్, వైట్ పీచ్, తెల్ల ఆలుగడ్డ, కొన్ని పుట్టగొడుగుల్లో బీటా గ్లూకాన్స్, లిగ్నాన్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధకశక్తిని పెంచి, మనకు హాని చేసే అంశాలపై పోరాడే ‘బి’ సెల్స్, ‘టి’ సెల్స్ను ఉత్తేజితం చేస్తాయి. పెద్దపేగు, రొమ్ము, ప్రోస్టేట్కు వచ్చే క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. హార్మోన్ల విడుదల సమ పాళ్లలో ఉండేలా చూస్తాయి. ఫలితంగా హార్మోన్ల అసమతౌల్యం వల్ల వచ్చే క్యాన్సర్లను నివారిస్తాయి.
ఎర్ర పండ్లు, కూరలు...
టొమాటో, చెర్రీ పండ్లు, ఎర్ర జామ, ఎరగ్రా ఉండే బొప్పాయి, ఎరర్రంగులో ఉండే ద్రాక్ష, ఎరద్రానిమ్మ, ఆపిల్స్, స్ట్రాబెర్రీ పండ్లు; దుంపల విషయా నికి వస్తే ముల్లంగి, ఎరగ్రా కనిపించే ఉల్లి, వంటల్లో ఉపయోగించే ఇతర తినుబండారాలైన ఎరమ్రిరపకాయలు, రెడ్ బెల్ పెప్పర్ వంటి వాటిల్లో ప్రధానంగా లైకోపిన్, ఎల్లాజిక్ యాసిడ్, క్వెర్సిటిన్, హెస్పరిడిన్ వంటి పోషకాలు ఉంటా
యి. ఇవన్నీ ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గించడమే గాక, కణుతుల పెరుగుదలను నిరోధిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. శరీరం ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రీరా డికిల్స్ను వ్యర్థాలను తొలగించినట్లుగా శరీరం నుంచి బయటకు తోసేస్తాయి. కీళ్లకు బలాన్ని ఇస్తాయి. అందుకే ఈ రంగు తినుబండారాలు ఆర్థరైటిస్ ఉన్నవారికి చాలా మంచిది.

పసుపు / నారింజ రంగు...

ఆప్రికాట్, కొన్ని పసుపు రంగు క్యారట్స్, నిమ్మ, మామిడి, నారింజ, పసుపు రంగులో ఉండే బొప్పాయి. పీచ్, పైనాపిల్, పసు పురంగు ఆపిల్స్, ఎల్లో ఫిగ్, ఎల్లో పియర్స్ వంటి పండ్లు, గుమ్మడి వంటి కాయలు, స్వీట్కార్న్ వంటి పొత్తులు, చిలగడదుంప వంటి దుంపలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ప్రధానంగా బీటా కెరోటిన్, జియాగ్జాంథిన్, ఫ్లేవనారుడ్స్, లైకోపిన్, పొటాషియమ్, విటమిన్ సీ వంటి పోష కాలు ఎక్కువ. ఇవి వయసు పెరగడం వల్ల వచ్చే అనేక సమస్యలను నివారిస్తాయి. అంటే ఒకరకంగా వయసు పెరిగినప్పుడు వచ్చే దుష్ర్పభావాలను తగ్గించి దీర్ఘకాలం యౌవనంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. వయసు పెరగడంతో వచ్చే కంటి సమస్యలను, మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి జబ్బులను నివారిస్తాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top